IT Employees : ఐటీ ఉద్యోగులకు గుడ్ టైమ్ మొదలైంది?

టాప్ ఐటి సేవల కంపెనీలు గత రెండు త్రైమాసికాల్లో బ్యాక్-టు-బ్యాక్ వేతనాలను ( full quarterly variable allowance) పెంచేశాయి.

100% quarterly variable pay : ఐటీ ఉద్యోగులకు గుడ్ టైమ్ మొదలైంది… కరోనామహమ్మారి కారణంగా ఐటీ కంపెనీలన్నీ డిజిటలైజేషన్ దిశగా దృష్టిసారించాయి. ఉద్యోగులంతా ఆన్‌లైన్‌, వర్క్ ఫ్రమ్ హోంలకు ప్రాధాన్యత కల్పించాయి. కరోనా సంక్షోభ సమయంలో అనేకమంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయిన పరిస్థితులు లేకపోలేదు. కరోనా ప్రభావం ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా అనేక మంది ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలు గ్లోబల్ కార్పొరేట్ల డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో క్రమంగా పుంజుకుంటున్నాయి.

2020లో కంటే ఐటీ కంపెనీలు ఈ ఏడాదిలో ఒక్కొక్కటిగా లాభాలను ఆర్జించే దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ దశలో ఐటీ ఉద్యోగులు పోటీకి తగినట్టుగా తమ ప్రతిభను నిలుపుకోవడం అతిపెద్ద సవాలుగా చెప్పుకోవాలి. ఐటీ సంస్థలో రాణించాలంటే నైపుణ్యం ఎంతో అవసరం. అందుకే అట్రిషన్ (క్షీణత) తగ్గించడానికి ఐటి కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే టాప్ ఐటి సేవల కంపెనీలు గత రెండు త్రైమాసికాల్లో బ్యాక్-టు-బ్యాక్ వేతనాలను ( full quarterly variable allowance) పెంచేశాయి. ఇప్పుడు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు 100శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లిస్తున్నాయని ఓ నివేదిక పేర్కొంది. దాంతో ప్రతి ఒక ఐటీ ఉద్యోగి బోనస్‌గా 100 శాతం వేరియబుల్ వేతనాలను పొందనున్నారు.
Mercedes Benz Gift : ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్..బాగా పనిచేస్తే మెర్సిడెస్ బెంజ్ కార్లు గిఫ్టు

నివేదిక ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services), భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థ… ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేకుండా తమ ప్యాకేజీలో ఉద్యోగులందరికీ పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని చెల్లిస్తోంది. ఇన్ఫోసిస్, మైండ్‌ట్రీ కన్సల్టింగ్ (TCS, Infosys, Mindtree Consulting) కంపెనీలు  కూడా తమ ఉద్యోగులకు 100శాతం వేరియబుల్ ( full quarterly variable allowance) వేతనాలను చెల్లిస్తున్నాయి. తద్వారా అట్రిషన్ రేట్లు మరోసారి ప్రీ-కోవిడ్ బెంచ్‌మార్క్‌లకు (15-20శాతం) వెళ్తాయనే ఆందోళనగా ఉంది. ప్రస్తుతానికి ఉద్యోగులకు రివార్డ్ ఇవ్వడం ద్వారా వారి ప్రతిభను నిలుపుకోవడానికి ఐటి కంపెనీలకు ఉత్తమ వ్యూహమని టెక్ ఇండస్ట్రీ రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ సీనియర్ రీసెర్చ్ డైరెక్టర్ డిడి మిశ్రా అన్నారు.

ప్రస్తుత కరోనా పరిస్థితులకు తగినట్టుగా అన్ని రంగాలలోని కంపెనీలు డిజిటలైజేషన్ వేగవంతం చేస్తున్నాయి. భారతదేశంలోని టాప్ ఐటి సర్వీసుల కంపెనీలు 2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 100శాతం వేరియబుల్స్ ఇస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను పెంచేశాయి. ఐటీ రంగంలో ఉద్యోగుల భర్తీకి ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే  ప్రధానంగా 5-10 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు 100 శాతం వేతనాలను పెంచేశాయి. ఇప్పటికే  పలు కంపెనీలు తమ ఉద్యోగుల ప్రతిభను ఉపయోగించుకుని వ్యాపారంలో గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఫలితంగా ఐటీ ఉద్యోగుల్లో భారీ డిమాండ్‌ పెరుగుతుందని మిశ్రా అన్నారు. జూలైలో, TCS లోని ఉద్యోగులు త్రైమాసికానికి 100శాతం వేరియబుల్ పే-అవుట్ ప్రకటించింది. భారతీయ ఐటి సేవల మధ్య క్షీణత (attrition) పెరుగుతోందని ఎవరెస్ట్ గ్రూప్ పార్టనర్ జిమిత్ అరోరా తెలిపారు. తత్ఫలితంగా, ఈ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను నిలుపుకోవటానికి, కొరతను అరికట్టడానికి వేతనాలు పెంపుతో పాటు ప్రమోషన్లు, అలవెన్సులను చెల్లించేందుకు ఎంతమాత్రం వెనుకాడటం లేదు.
WFH Employees: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఇళ్లలో సీసీ కెమెరాలు

ట్రెండింగ్ వార్తలు