Tesla Model Y Price : టెస్లా మోడల్ Y కారు వచ్చేసిందోచ్.. కొత్త ‘టెస్సీ’ యాప్ కూడా.. ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.. భారత్ ధర ఎంతంటే?
Tesla Model Y Price : టెస్లా మోడల్ Y కారు వచ్చేసింది. భారత మార్కెట్లోకి ఫస్ట్ కారు ఇదే.. టెస్సీ iOS యాప్ కూడా రిలీజ్ అయింది..

Tesla Model Y Price
Tesla Model Y Price : టెస్లా అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి కొత్త టెస్లా ఈవీ కారు వచ్చేసింది. టెస్లా మోడల్ Y ముంబైలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో (Tesla Model Y Price) ఆవిష్కరించింది. ఎలన్ మస్క్ టెస్లా అధికారికంగా భారత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో విక్రయించనున్న ఫస్ట్ EV టెస్లా మోడల్ Y కారు ఇదే..
అమెరికాకు ఆటోమోటివ్ కంపెనీ కొత్త మోడల్ కారు ఢిల్లీలో ఆన్-రోడ్ ధరలు సుమారు రూ. 61 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. అంతేకాదు.. iOS టెస్సీ యాప్ కూడా భారత్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. టెస్లా యజమానులు ఈ యాప్ ద్వారా టెస్లా ఈవీ కారును కంట్రోల్ చేయొచ్చు. బ్యాటరీ, ఛార్జింగ్, ట్రిప్పులను ట్రాక్ చేయొచ్చు.
భారత్ టెస్లా మోడల్ Y ధర, లభ్యత :
దేశ మార్కెట్లో టెస్లా మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. లాంగ్ రేంజ్ RWD మోడల్ ప్రారంభ ధర రూ. 67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). టెస్లా మోడల్ Y స్టాండర్డ్ స్టెల్త్ గ్రే ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్‌లో బ్లాక్ ఇంటీరియర్స్‌తో వస్తుంది.
ఇతర ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్‌ల ఛార్జీలు రూ. 95వేల నుంచి ప్రారంభమై రూ. 1.85 లక్షల వరకు ఉంటాయి. అదే సమయంలో, వైట్ ఇంటీరియర్‌లను ఎంచుకోవడం వల్ల కొనుగోలుదారులకు రూ. 95వేల వరకు వెసులుబాటు ఉంటుంది.
కంపెనీ ప్రకారం.. టెస్లా మోడల్ Y ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ సామర్థ్యాలను (FSD) అన్‌లాక్ చేసేందుకు రూ. 6 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో నావిగేట్ ఆన్ ఆటోపైలట్, ఆటోపార్క్, సమ్మన్, ట్రాఫిక్, స్టాప్ సైన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మాక్సిటీలో కొత్త టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఉంది. ఇక్కడ కస్టమర్లు ఈవీ కారును ట్రై చేయొచ్చు.. ఈ సెంటర్ కూడా ఓపెన్ అయింది. దేశంలో టెస్లా మోడల్ Y కోసం డెలివరీలు Q3 2025 ప్రారంభమయ్యాయి. స్తుతం ఢిల్లీ, గురుగ్రామ్, ముంబైలలో కొనుగోలు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
టెస్సీ యాప్ :
భారత మార్కెట్లో టెస్లా మోడల్ Y లాంచ్ కోసం ఎలన్ మస్క్ యాజమాన్యంలోని కంపెనీ టెస్సీ యాప్‌ను కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం iOSలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యాప్ టెస్లా యజమానుల కోసం అందిస్తోంది. టెస్సీ యాప్ ద్వారా వినియోగదారులు ప్రతి ట్రిప్‌ను ట్రాక్ చేయవచ్చు. బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఇతర కార్లతో కంపేర్ చేయొచ్చు. ఛార్జింగ్ స్టేటస్, ఫాంటమ్ డ్రెయిన్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు.
ఇంకా, టెస్సీ యాప్ యజమానులు ఆపిల్ వాచ్ ద్వారా తమ టెస్లాను కంట్రోల్ చేయొచ్చు. మ్యాక్ కంప్యూటర్ లేదా విండోస్ ఆధారిత పీసీలో వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి కూడా కంట్రోల్ చేయవచ్చు. సెంట్రీ ఈవెంట్స్ ట్రాక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలారంను ట్రిగ్గర్ చేస్తుంది. సడన్ జెర్కీ మూమెంట్స్ గుర్తించడం లేదా ఎవరైనా ఈవీ డోర్ లేదా ట్రంక్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే యాప్‌కు నోటిఫికేషన్‌లను పంపుతుంది.
అయితే, టెస్సీ (Tessie) యాప్ కోసం సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. లెగసీ ప్లాన్‌కు నెలకు రూ. 499 నుంచి ప్రారంభమవుతుంది. అదే ప్రో ప్లాన్‌కు నెలకు రూ. 1,499 వరకు ఉండవచ్చు. టెస్లా యజమానులు వార్షిక సబ్‌స్క్రిప్షన్ లేదా లైఫ్ టైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ టెస్లా కారు బేసిక్ ప్రారంభ ధర రూ. 19,900 ఉంటే.. ప్రో ప్లాన్ ధర రూ. 29,900 నుంచి అందుబాటులో ఉంది.