Gold Rate: 4 రోజులుగా తగ్గి.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు

ఇవాళ వెండి ధరల్లో రూ.2000 పెరుగుదల కనపడింది.

Gold Rate: 4 రోజులుగా తగ్గి.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు

Updated On : March 4, 2025 / 10:22 AM IST

పసిడి కొనుగోలుదారులకు మళ్లీ షాక్. గత నాలుగైదు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. ఇవాళ ఉదయం 10 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర రూ.700 పెరిగింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తులానికి రూ.700 పెరిగి, రూ.80,100గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మరింత పెరిగింది. రూ.760 పెరిగి తులం బంగారం ధర రూ.87,380గా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

Gold

Gold

ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.80,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.87,530గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగింది. ముంబైలో తులం బంగారం ధర రూ.80,100గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మాత్రం కొంత పెరిగింది. రూ.760 పెరిగి తులం బంగారం ధర రూ.87,380గా ఉంది.

ఇవాళ వెండి ధరల్లో రూ.2000 పెరుగుదల కనపడింది

ఏ నగరాల్లో ఎలా?

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.98,000గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.98,000గా ఉంది

గమనిక: ఈ బంగారం ధరలు ఉదయం 10 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారమే. బంగారం ధరలు మారుతూ ఉంటాయి.