Top Electric Scooters : సింగల్ ఛార్జింగ్‌తో 200 కి.మీ దూసుకెళ్లే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చార్జింగ్ టైమ్, ఫీచర్లు, రేట్.. ఫుల్ డిటెయిల్స్
Top Electric Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో అనేక టాప్ బ్రాండ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. చార్జింగ్ టైమ్, ఫీచర్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Electric Scooters
Top Electric Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్లో అనేక బ్రాండ్ల ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఏ బ్రాండ్ స్కూటర్ బెటర్ అనేది తేల్చుకో లేకపోతున్నారా? ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
రేంజ్, పర్ఫార్మెన్స్ కోరుకునే కొనుగోలుదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రధాన ఆప్షన్లుగా మారుతున్నాయి. లాంగ్ రేజ్ అంటే.. తక్కువ ఛార్జింగ్ స్టాప్‌లు మాత్రమే కాదు మొత్తం యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. చాలా మంది సిటీ రైడర్లకు 120 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
లాంగ్ రేంజ్ స్కూటర్లతో బ్యాటరీ ఒత్తిడి తగ్గుతుంది. డీప్ డిశ్చార్జ్‌లు చేయనవసరం ఉండదు. స్కూటర్ లాంగ్ టైమ్ వస్తుంది. మైలేజీ రేంజ్ టెన్షన్ ఉండదు. రైడర్లు చక్కగా లాంగ్ డ్రైవ్ రైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. భారత మార్కెట్లో కొన్ని టాప్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
ఏథర్ 450X (రూ. 1.39 లక్షలు, ఎక్స్-షోరూమ్) :
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి ఏథర్ 450X బెస్ట్ అని చెప్పవచ్చు. 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 150 కి.మీ రేంజ్ అందిస్తుంది. స్పీడ్ ఛార్జింగ్, టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్, ఇంటెలిజెంట్ రైడ్ అనలిటిక్స్‌తో కనెక్ట్ చేసిన స్మార్ట్ స్కూటర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే సిటీ రైడర్‌లకు సరైన స్కూటర్ అని చెప్పవచ్చు.
ఓపీజీ మొబిలిటీ ఫెర్రాటో ఫాస్ట్ F4 (రూ. 1.19 లక్షలు, ఎక్స్-షోరూమ్) :
ఓపీజీ (OPG) మొబిలిటీ ఫెర్రాటో ఫాస్ట్ F4 అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంగ్ రేంజ్ సామర్థ్యాలను కోరుకునే రైడర్‌లకు సరైన ఆప్షన్. 3.53 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఫుల్ ఛార్జ్‌పై 160 కి.మీ వరకు ప్రయాణాన్ని అందిస్తుంది. గంటకు 70 కి.మీ గరిష్ట వేగం, మల్టీ రైడింగ్ మోడ్‌లతో రోజువారీ ప్రయాణానికి అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
సింపుల్ వన్ (రూ. 1.45 లక్షలు, ఎక్స్-షోరూమ్) :
సింపుల్ ఎనర్జీ నుంచి సింపుల్ వన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈవీ రేంజ్‌లో పవర్‌ఫుల్ రేంజ్‌గా నిలిచింది. 5kWh బ్యాటరీతో సింగిల్ ఛార్జ్ చేస్తే.. 212 కి.మీ వరకు దూసుకెళ్లగలదు. గంటకు 105 కి.మీ గరిష్ట వేగం, 2.77 సెకన్లలో ఆకట్టుకునేలా గంటకు 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకోగలదు. టాప్ రేంజ్ కోరుకునే రైడర్‌లకు బెస్ట్ మోడల్ అని చెప్పవచ్చు.
ఓలా S1 ప్రో (రూ. 1.47 లక్షలు, ఎక్స్-షోరూమ్) :
భారత ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో బాగా పాపులర్ అయింది. 4kWh బ్యాటరీతో వస్తుంది. 181 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. ఓలా S1 ప్రో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, వాయిస్ కమాండ్‌లు, మల్టీ రైడింగ్ మోడ్స్ వంటి స్మార్ట్ ఫీచర్‌లతో లోడ్ అయింది. టెక్-అవగాహన ఉన్న రైడర్‌లను ఆకట్టుకునేలా గంటకు 120 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
ప్యూర్ ఈవీ ఎప్లుటో 7జీ ( రూ. 99,999, ఎక్స్-షోరూమ్) :
సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోరుకునేవారికి ప్యూర్ ఈవీ ఎప్లుటో 7జీ బెస్ట్ ఆప్షన్. ఈ స్కూటర్ 2.5 kWh బ్యాటరీ 120 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. గంటకు 60 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. తక్కువ దూరం వెళ్లే నగర ప్రయాణాలకు బెస్ట్ స్కూటర్ అని చెప్పవచ్చు.