Home Loans Tips : మీ హోం లోన్ పదేపదే రిజెక్ట్ అవుతుందా? మీరు చేస్తున్న తప్పులివే.. ఈసారి అప్లయ్ చేసే ముందు ఇలా చేయండి..!

Home Loans : మీ హోం లోన్ పదేపదే రిజెక్ట్ అవుతుందా? ఎన్నిసార్లు అప్లయ్ చేసినా ఇదే పరిస్థితి ఎదురవుతుందా? అయితే దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఈసారి అప్లయ్ చేసే ముందు ఈ ముఖ్య విషయాలను తెలుసుకోండి.

Top Reasons for Home Loan Rejection

Home Loans Tips : అందరికి సొంత ఇల్లు అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో ఆరాటపడుతుంటారు. వెంటనే ఏదైనా బ్యాంకులో హోం లోన్ తీసుకోవాలని భావిస్తుంటారు. కానీ, అందరికి హోం లోన్ కచ్చితంగా వస్తుందని గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే చేసే చిన్న తప్పిదాలు కూడా హోం లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఇక్కడ హోం లోన్ అప్లయ్ చేయడం అనేది పెద్ద టాస్క్ అని గమనించాలి.

Read Also : Gold Investment : పెట్టుబడికి ఫిజికల్ గోల్డ్ కన్నా గోల్డ్ ఈటీఎఫ్ ఎందుకు బెటర్? ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే మీరు ఇదే చేస్తారు!

ఎందుకంటే.. మీరు ఒకటి లేదా రెండు కారణాల వల్ల హోం లోన్ అప్లికేషన్ తిరస్కరించవచ్చు. ఇలాంటి సమయాల్లో చాలామంది ఏమి చేయాలో తెలియక గందరగోళానికి గురవుతారు. మీ హోం లోన్ కూడా పదేపదే రిజెక్ట్ అవుతుందా? మీకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందా? అయితే, దరఖాస్తుదారులు ఏమి చేయాలి? దరఖాస్తు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మార్చి 2025 నాటికి భారత్‌లో హోం లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లను అందిస్తున్నాయి అనేది ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అనేక బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు హోం లోన్లపై ఆకర్షణీయమైన వడ్డీలను అందిస్తున్నాయి.

ఉదాహరణకు.. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు సంవత్సరానికి 8.1 శాతం నుంచి 8.15శాతం వరకు తక్కువ రేట్లను అందిస్తున్నాయి. అలాగే, (HDFC, ICICI) వంటి ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు సంవత్సరానికి 8.75 శాతం నుంచి వడ్డీలను అందిస్తున్నాయి.

హోం లోన్లు రిజెక్ట్ కావడానికి అసలు కారణాలివే :
తక్కువ క్రెడిట్ స్కోర్లు, అధిక రుణ-ఆదాయ నిష్పత్తి, అస్థిరమైన ఉద్యోగం, తగినంత ఆదాయం లేకపోవడం, పర్సనల్ లోన్ హిస్టరీ సరిగా లేకపోవడం మొదలైనవి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇంతకీ మీ దరఖాస్తు ఎందుకు తిరస్కరించారు? హోం లోన్ సులభంగా పొందడానికి మీరు ఏం చేయాలో ముందుగా తెలుసుకోవాలి. తద్వారా భవిష్యత్తులో మీరు ఎక్కడా హోం లోన్ తీసుకున్నా ఈజీగా పొందడానికి వీలుంటుంది. కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుని తప్పక పాటించాలి.

లో క్రెడిట్ రేటింగ్ :
లో క్రెడిట్ రేటింగ్ అంటే.. ఎక్కువ రిస్క్‌లో ఉన్నారని అర్థం. హోం లోన్ పొందడం అసాధ్యం. అప్పుడప్పుడు మీ క్రెడిట్ రిపోర్ట్, క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేయండి. గతంలో ఏవైనా తప్పులు లేదా తప్పు ఎంట్రీలు ఉంటే సరిదిద్దండి. సమయం గడిచేకొద్దీ మీ క్రెడిట్ రేటింగ్‌ను మెరుగుపరుస్తుంది.

బిల్డర్ లేదా ఇంటికి పర్మిషన్ లేదు : బ్యాంకులు అన్ని బిల్డర్లు లేదా ఇంటి ఆస్తులను ఆమోదిస్తాయి. రిజెక్ట్ కాకుండా ఉండేందుకు మీరు ఎంచుకున్న బిల్డర్, భవనం ఆమోదించిన రుణదాతల జాబితాలో భాగమని నిర్ధారించుకోండి.

అసురక్షితమైన జాబ్ హిస్టరీ : బ్యాంకులు సురక్షితమైన ఉద్యోగ చరిత్ర కలిగిన దరఖాస్తుదారులకు హోం లోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. మీరు ఏదైనా కంపెనీలో తరచూ మారిపోవడం లేదా మీ ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటే కూడా అప్లికేషన్ తిరిస్కరించవచ్చు.

డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడం : డాక్యుమెంట్లు అసంపూర్ణంగా ఉండటం, తప్పుగా నింపిన ఫారమ్‌లు మీ దరఖాస్తు తిరస్కరణకు లేదా ఆలస్యంకు కారణమవుతాయి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి.

ఆస్తి విలువ సమస్యలు : ఆస్తి విలువ తక్కువగా ఉన్నప్పుడు.. రుణదాతలు మీరు ఆశించిన మొత్తం లోన్ కన్నా తక్కువ విడుదల చేయవచ్చు లేదా దరఖాస్తును తిరస్కరించవచ్చు.

హోం లోన్ రిజెక్ట్ తర్వాత ఏం చేయాలంటే? :
మీ హోం లోన్ దరఖాస్తు తిరస్కరిస్తే.. మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవేంటో ఓసారి జాగ్రత్తగా తెలుసుకోండి.

మీ క్రెడిట్ స్కోర్‌ను వెరిఫై చేసుకోండి :
మీ క్రెడిట్ రిపోర్టులో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దండి. సకాలంలో బిల్లులు, తీసుకున్న అప్పులను చెల్లించడం ద్వారా మీ స్కోర్‌ను పెంచుకోండి.

మీ దరఖాస్తు అర్హతలను వెరిఫై చేయండి :
మళ్ళీ దరఖాస్తు చేసుకునే ముందు మీరు లోన్ ఇచ్చే బ్యాంకుల అవసరాలకు తగినట్టుగా ఉన్నారని నిర్ధారించండి. దరఖాస్తు చేసుకునే ముందు నిబంధనలు, షరతులు, వడ్డీ రేట్లు మొదలైనవి చెక్ చేయండి.

మరో బ్యాంకులో దరఖాస్తు చేసుకోండి :
అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సమానంగా రుణాలను ఇవ్వరు. ఒక బ్యాంకులో రిజెక్ట్ అయినా మరో బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకోండి :
హోం లోన్ ఆలస్యం లేదా తిరస్కరణ కాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకోండి.

Read Also : Gold Rates : బాబోయ్.. ఈ బంగారం ఇంతలా ఎందుకు పెరుగుతుంది? తగ్గినట్టే తగ్గి పెరగడానికి కారణం ఇదేనట.. ఎక్స్ పర్ట్స్ చెప్పింది వింటే..

కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి :
మీకు హోం లోన్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. మీ సంబంధిత బ్యాంకు కస్టమర్ సపోర్ట్ టీంను సంప్రదించండి.

ఈ కారణాలన్నీ దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే.. భవిష్యత్తులో మీరు హోం లోన్ పొందే అవకాశాలను పెంచుకోవచ్చు. మీ ఆర్థిక స్థితికి అనుగుణంగా మీకు అవసరమైన హోం లోన్ పొందడానికి ఎల్లప్పుడూ ఆయా బ్యాంకులు అందించే వడ్డీలను పోల్చి చూసుకోండి. ఆ తర్వాత ఏ బ్యాంకు మీ అవసరాలకు తగినట్టుగా ఉందో గుర్తించి అందులోనే దరఖాస్తు చేసుకోండి.