Top Smart TV Prices
Top Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం 2025లో భారత మార్కెట్లో అద్భుతమైన స్మార్ట్‌టీవీ మోడల్స్ ఉన్నాయి. సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన టీవీలు ఎన్నో మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
మార్కెట్ డిమాండ్ తగ్గట్టుగా టీవీ తయారీదారులు కూడా అద్భుతమైన వాల్యూను అందించే మోడళ్లను రిలీజ్ చేస్తున్నారు. మార్చి 2025 నాటికి రూ. 30వేల లోపు టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన 4K క్లారిటీని అందించే స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయొచ్చు.
శాంసంగ్ T5450 టీవీ :
ఈ శాంసంగ్ బ్రాండ్ T5450 సిరీస్ టీవీ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఈ 43-అంగుళాల స్మార్ట్ టీవీ కలర్‌ఫుల్ ఫిక్చర్ క్వాలిటీని జనరేట్ చేస్తుంది. శాంసంగ్ టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో వెర్షన్‌తో వస్తుంది.
టీవీ అద్భుతమైన డిజైన్, సన్నని బెజెల్స్‌తో వ్యూ మరింత హైఎండ్‌గా కనిపిస్తుంది. వివిధ ఎక్స్‌ట్రనల్ డివైజ్‌లకు కనెక్ట్ చేసేందుకు అనేక USB, HDMI కనెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, శాంసంగ్ T5450 డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియోను కలిగి ఉంది.
సోనీ బ్రావియా 32W825 టీవీ :
హై ఫిక్చర్ క్వాలిటీ కలిగిన చిన్న టీవీ కోసం చూస్తున్న వారికి బెస్ట్ టీవీ. సోనీ 32W825 బ్రావియో మోడల్‌ను తీసుకోవచ్చు. ఈ 32-అంగుళాల టీవీలోని HDR యాక్టివిటీ మరింత క్లియర్ వ్యూను అందిస్తుంది. కాంట్రాస్ట్ కలర్ అప్‌గ్రేడ్ చేస్తుంది.
గూగుల్ ప్లే స్టోర్‌తో వినియోగదారులు ఆండ్రాయిడ్ టీవీలో వైడ్ రేంజ్ యాప్‌లు, సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ కంట్రోల్ ద్వారా ఈ టీవీని హ్యాండ్స్-ఫ్రీగా ఆపరేట్ చేయవచ్చు. మల్టీ HDMI కనెక్షన్‌లు, ఇంటిగ్రేటెడ్ Wi-Fi వంటి కమ్యూనికేషన్‌ను పొందవచ్చు.
థామ్సన్ 43TJQ0012 జియో టీవీ :
థామ్సన్ 43-అంగుళాల QLED టీవీ సరసమైన ధరలో అల్ట్రా HD (4K) రిజల్యూషన్ కలిగి ఉంది. (QLED VA) డిస్‌ప్లే ద్వారా మంచి క్వాలిటీని అందిస్తుంది. Netflix, Prime Video, Disney+ Hotstar వంటి ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు సహా అనేక అత్యంత పాపులర్ యాప్‌లు (Jio Telly OS)తో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
ఈ థామ్సన్ టీవీతో పాటు వచ్చే 40W బాక్స్ స్పీకర్లు స్ట్రాంగ్ ఆడియో అవుట్‌పుట్‌ను కలిగి ఉంటాయి. ఇతర HDMI, USB కనెక్షన్‌లు, అలాగే డ్యూయల్-బ్యాండ్ Wi-Fi వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. మీరు సరసమైన ధర గల QLED ఆప్షన్ టీవీ కోసం చూస్తుంటే ఇది బెటర్ ఆప్షన్.
ఏసర్ ప్రో సిరీస్ 40-అంగుళాలు టీవీ :
ఏసర్ (Acer) నుంచి ప్రో సిరీస్ టీవీ అనేది మంచి మిడ్ రేంజ్ టీవీ ఆప్షన్. HD-రెడీ వెర్షన్‌లలో ఇదొకటి. 40-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే ఇప్పటికీ 4K మాదిరిగా షార్ప్‌గా లేదు. వివిధ యూజర్ ప్రొఫైల్‌లు, కంటెంట్ సిఫార్సులతో UI ఆప్షన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 రన్ అయ్యే గూగుల్ టీవీతో వస్తుంది.
ఈ ధర పరిధిలో మెరుగైన సౌండింగ్ ఆప్షన్లలో ఒకటి. ఎందుకంటే Dolby Audioతో 30W స్పీకర్‌లను కలిగి ఉంది. అదనంగా, బ్లూటూత్ 5.0, వీడియో కాలింగ్, కాస్టింగ్‌కు సపోర్టు ఉంది. స్మార్ట్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. మిడ్ రేంజ్ స్క్రీన్ సైజు కలిగిన టీవీ కోసం చూస్తుంటే ఈ TV బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
TCL 43V6B TV :
సరసమైన టీవీ మార్కెట్‌లో TCL 43V6B టీవీ ఒకటి. 4K HDR సపోర్టుతో 43-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ధరకు తగినట్టుగా మంచి కలర్ క్లారిటీ ఉంటుంది. ఈ టీవీలో (Google TV) వైడ్ రేంజ్ సర్వీసులు, యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. అదనంగా, HDMI 2.1కి సపోర్టు ఇస్తుంది.
మీరు వినూత్న డివైజ్ లేదా గేమ్ కన్సోల్‌ను కనెక్ట్ చేసేందుకు ఇదే అద్భుతమైన ఆప్షన్. టీవీ చిన్న బెజెల్స్ కారణంగా అప్‌డేట్ స్టయిల్ కలిగి ఉంది. రోజువారీ వ్యూకు ఆడియో సరిపోతుంది. మంచి సౌండ్ కోసం సౌండ్‌బార్ కనెక్ట్ చేసుకోవచ్చు.