Top 5 Expensive Watches : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్‌లివే.. ఒక్కో వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

Top 5 Expensive Watches : లగ్జరీ వాచీలు హోదా, సంపద, ప్రతిష్టకు ప్రతిరూపాలు. గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్ నుంచి పాటెక్ ఫిలిప్ స్టెయిన్‌లెస్ స్టీల్ వాచ్ వరకు ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన వాచ్ ధరల వివరాలను తెలుసుకుందాం.

Top 5 Expensive Watches : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్‌లివే.. ఒక్కో వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

Top 5 Expensive Watches

Updated On : March 27, 2025 / 11:40 PM IST

Top 5 Expensive Watches : ప్రపంచ మార్కెట్లో మొబైల్ ఫోన్లకు మాత్రమే కాదు.. లగ్జరీ వాచ్‌లకు అంతకన్నా క్రేజ్ ఉంది. చాలామంది అత్యంత ఖరీదైన వాచ్‌లను స్టేటస్ కోసం వాడేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఏదైనా లగ్జరీ వాచ్ కనిపిస్తే చాలు.. వెంటనే కొనేసి పెట్టుకుంటారు.

సామాన్యులు కొనలేరు కానీ, కోటీశ్వరులు, లగ్జరీ లైఫ్ లీడ్ చేసే వాళ్లు ఈ ఖరీదైన వాచ్ లుంటే తెగ ఇష్టపడుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో ఒక హాబీగా చేస్తుంటారు. లగ్జరీ వాచ్‌లకు ఉన్న గిరాకీ అంతాఇంతా కాదనే చెప్పాలి. ఒక్కో వాచ్ ధర కోట్ల విలువ పలుకుతున్నాయి. అసలు ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది.

Read Also : Apple iPhone 15 : అమెజాన్‌లో క్రేజీ ఆఫర్.. లక్ష విలువైన ఐఫోన్‌ 15 అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?

మనం సాధారణంగా గడియారాలను కేవలం టైమ్ చెప్పే డివైజ్‌లుగా మాత్రమే చూస్తుంటాం. కాలక్రమేణా ఇవి మరింత లగ్జరీగా మారిపోయాయి. లగ్జరీ వాచ్ కళాఖండాలు, సంపదకు చిహ్నాలుగా మారిపోయాయి. ఖరీదైన వాచ్‌లు క్రియేటివిటీతో పాటు హ్యాండ్ వర్క్ పట్ల మానవుల ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి.

లగ్జరీ వాచీలు హోదా, సంపద, ప్రతిష్టకు ప్రతిరూపాలు. గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్ వజ్రాల వాచ్ దగ్గర నుంచి పాటెక్ ఫిలిప్ గ్రాండ్‌మాస్టర్, జేగర్-లీకౌల్ట్రే జోయిలెరీ వరకు, ప్రతి వాచ్ లగ్జరీ, స్టయిల్‌కి శైలికి నిదర్శనం. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన గడియారాల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో ప్రత్యేక ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.

1. గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్ ధర : రూ. 458 కోట్లు
గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్ (Graff Diamonds Hallucination) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్. ఈ గడియారం 110.09 క్యారెట్ల ఎల్లో వజ్రాలతో కూడిన వజ్రాల అమరిక. ఇందులో అద్భుతమైన కళ దాగి ఉంది. 38.14 క్యారెట్ల బరువున్న పియర్ ఆకారపు మధ్య రాయి కూడా ఉంది. ఈ వాచ్ ప్రత్యేకమైన డిజైన్‌ను కంపెనీ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. వజ్రాలతో పొదిగిన ఈ గ్రాఫ్ డైమండ్స్ ధర అక్షరాలా భారత కరెన్సీలో రూ. 458 కోట్లు ఉంటుంది.

Graff Diamonds Hallucination

Graff Diamonds Hallucination

2. గ్రాఫ్ డైమండ్స్ ది ఫాసినేషన్ : ధర రూ. 416 కోట్లు
ఈ గ్రాఫ్ డైమండ్స్ ది ఫాసినేషన్ (Graff Diamonds The Fascination) హై-ఎండ్ వాచ్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ వాచ్ అందమైన వజ్రాల అమరికతో పాటు డిజైన్ అత్యంత ఆకర్షణగా ఉంటుంది. ది ఫాసినేషన్‌ జాబితాలో గ్రాఫ్ డైమండ్స్‌ ఒక అద్భుతమైన వాచ్‌గా నిలిచింది. పూర్తిగా లగ్జరీ టైమ్‌పీస్‌లను ఉత్పత్తి చేయగల బ్రాండ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వాచ్ ధర మార్కెట్లో రూ. 416 కోట్లు ఉంటుంది.

Graff Diamonds The Fascination

Graff Diamonds The Fascination

3. పటేక్ ఫిలిప్ గ్రాండ్‌మాస్టర్ చైమ్ రెఫ్ (6300A-010) ధర : రూ. 249 కోట్లు
ఈ పటేక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ చైమ్ రెఫ్ (Patek Philippe Grandmaster Chime Ref. 6300A-010) వాచ్‌లో 20 కాంప్లికేషన్స్, వన్ మినిట్ రిపీటర్, అలాగే డేట్ రిపీటర్ ఉన్నాయి. ఇది పటేక్ ఫిలిప్ 175వ వార్షికోత్సవానికి గుర్తుగా తయారైంది. ఈ వాచ్ డబుల్-ఫేసెస్డ్ మెకానిజం కలిగి ఉంది. ఈ విలువైన వాచ్ ధర రూ. 249 కోట్లు ఉంటుంది.

Patek Philippe Grandmaster

Patek Philippe Grandmaster

4. బ్రెగ్యుట్ గ్రాండే కాంప్లికేషన్ మేరీ ఆంటోనిట్టే : ధర రూ. 249 కోట్లు
బ్రెగ్వెట్ గ్రాండే కాంప్లికేషన్ మేరీ ఆంటోనిట్టే (Breguet Grande Complication Marie Antoinette) వాచ్‌ను ఫ్రెంచ్ రాణి ప్రేమికులలో ఒకరైన మేరీ ఆంటోనిట్టే ఆమెకు గిఫ్ట్‌గా అందించింది. ఇది ప్రేమకు చిహ్నంగా, అత్యంత విలువైన గడియారాలలో ఒకటిగా నిలిచింది. ఈ వాచ్ ధర రూ. 249 కోట్లు విలువ ఉంటుంది.

Breguet Grande Complication Marie Antoinette

Breguet Grande Complication Marie Antoinette

Read Also : Window vs Split AC : ఈ వేసవిలో కొత్త ఏసీ కొంటున్నారా? విండోస్ ఏసీనా? స్ప్లిట్ ఏసీనా? ఏది కొంటే బెటర్? ఎక్స్‌పర్ట్స్ టిప్స్ మీకోసం..!

5. జేగర్-లీకౌల్ట్రే జోయిలెరీ 101 మాంచెట్ : ధర రూ. 216 కోట్లు
జేగర్-లీకౌల్ట్రే జోయిలెరీ 101 మాంచెట్ (Jaeger-LeCoultre Joaillerie 101 Manchette) వాచ్ తెల్ల బంగారంతో తయారైంది. టూర్‌బిల్లాన్ సంక్లిష్టతను కలిగి ఉంది. ఈ స్టేట్‌మెంట్ యాక్సెసరీ ఖరీదైన డిజైన్‌లో 577 వజ్రాలు ఉన్నాయి. ఈ వాచ్ విలువ ఏకంగా రూ. 215 కోట్లు ఉంటుంది.

Jaeger-LeCoultre Joaillerie 101 Manchette

Jaeger-LeCoultre Joaillerie 101 Manchette