ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు
టెలివిజన్ కేబుల్, డీటీహెచ్ ప్రసారాలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెచ్చిన కొత్త నిబంధనలు DTH ఆపరేటర్లు, లోకల్ కేబుల్ ఆపరేటర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి.

టెలివిజన్ కేబుల్, డీటీహెచ్ ప్రసారాలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెచ్చిన కొత్త నిబంధనలు DTH ఆపరేటర్లు, లోకల్ కేబుల్ ఆపరేటర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి.
టెలివిజన్ కేబుల్, డీటీహెచ్ ప్రసారాలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెచ్చిన కొత్త నిబంధనలు DTH ఆపరేటర్లు, లోకల్ కేబుల్ ఆపరేటర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి. ట్రాయ్ తీసుకొచ్చిన ఏ ఛానళ్లు చూడాలనే కస్టమర్లకే ఛాన్స్ ఇవ్వడం బాగానే ఉన్నా.. ప్యాకేజీలు, ఒక్కో ఛానల్ ఎంచుకుంటూ పోతే.. అదనపు ట్యాక్స్ లతో కలిపి నెలకు కట్టే బిల్లు తడిసి మోపడు అవుతుంది. ఇందులో HD, SD ఛానళ్ల ప్యాక్ కలిపితే రూ.300-400 పైనే బిల్లు చెల్లించాల్సి వస్తుంది. దీనికితోడు తప్పనిసరి NCF ఫీ రూ.130 కూడా చెల్లించాల్సిందే. టాప్ 5 ఛానళ్లు ఎంచుకుంటేనే ప్యాక్ పెరిగిపోతుంది. దీంతో DTH కస్టమర్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విక్లీ రిపోర్టు మాత్రమే.. క్రిసల్ నివేదిక తప్పు..
మరోవైపు లోకల్ కేబుల్ ఆపరేటర్లు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాయ్ కొత్త రూల్స్ DTH వినియోగదారులకు నెలకు చెల్లించే బిల్లు భారీగా పెరుగుతుందని ఇటీవల క్రిసిల్ నివేదిక వెల్లడించింది. దీనిపై ట్రాయ్ స్పందించింది. క్రిసిల్ నివేదిక.. డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ ను సమగ్రంగా అర్థం చేసుకోలేదని, అది తప్పుడు నివేదికగా ట్రాయ్ చైర్మన్ రామ్ సేవక్ శర్మ చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని టాప్ రేటింగ్ ఛానళ్ల ఎంపిక ఆధారంగా టీవీ రేటింగ్ ఏజెన్సీ BARC (జనవరి 25, 2019) నుంచి ఒక వారానికి సంబంధించిన నివేదిక మాత్రమేనని ట్రాయ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
డిటిహెచ్ కస్టమర్లు డోంట్ వర్రీ..
కొత్త DTH నిబంధనలతో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రాయ్ సూచించింది. DTH ఛానెళ్ల ధరలపై కస్టమర్లు చెల్లించే బిల్లు భారాన్ని తగ్గించేందుకే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు రెగ్యులర్ బాడీ స్పష్టం చేసింది. ‘‘మరో 3 నెలల్లో వివిధ ఛానళ్ల ధరలు తగ్గిపోతాయని అంచనా వేస్తున్నాం’’ అని ట్రాయ్ సెక్రటరీ ఎస్.కే. గుప్తా తెలిపారు. క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం.. బ్రాడ్ క్యాస్టర్లు, DTH కంపెనీలు నెట్ వర్క్ కెపాసిటీ (NCF) కింద ఫీజు, ఛానళ్ల ధరలను ప్రకటించాయని, నెలవారీ టీవీ బిల్లులు కస్టమర్లకు భారంగా మారుతుందని తెలిపింది. ట్రాయ్ రూల్స్ పాటిస్తూనే సర్వీసు ప్రొవైడర్లు తమ వినియోగదారులకు NCF ఫీ కింద డిసౌంట్లు ఇవ్వొచ్చు, లేదా రద్దు చేసే అవకాశం కూడా ఉందని అన్నారు.
ట్విట్టర్ వేదికగా కస్టమర్ల అసంతృప్తి
ఇప్పటికే కొత్త రూల్స్ అమల్లోకి వచ్చినప్పటినుంచి DTH కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. కొందరు వినియోగదారులు తమ అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. ట్రాయ్ అమల్లోకి తెచ్చిన ట్రాయ్ రూల్స్.. చెత్త రూల్స్ అంటున్నారు. ఈ కొత్త రూల్స్.. కస్టమర్లను గందరగోళంలో నెట్టేసిందని నెలకు తాము భారీగా టీవీ బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
@TRAI
By new regime of dth rules my pack goes to 300 to 650 per month ..
Is this a joke?#removencf— Dr Irfan Jethva (@DrIrfanJethva1) February 6, 2019
Bad DTH cable TV rules by trai. It is total loot of customers by trai.Current packs were cheap as compared to new trai rules. Rs 154 for FTA channels is big loot.Currently many dth operators are providing FTA channels under packs of Rs. 99. It will increase monthly bill by 25%.
— Guriqbal Kang (@GuriqbalK) February 5, 2019
@TRAI your policy regarding the new DTH rules have been the most devastating policy ever. I have to pay more than double the price for the same channels that we used to get earlier. Extremely disappointed. ? #trai #dth
— Saleem (@geeky_coolness) February 4, 2019
@TRAI new DTH rules shows that every policy decision of this government tenure is half baked thought. #LeaveD2hForever #FraudD2h
— Akash J (@akashd116) February 5, 2019
#TRAI New rules have given the DTH operators a license to extortion of it’s customers.#TRAI #Airtel #AIRTEL #AIRTEL HD TV
— Aadil Williamson (@Crusades14) February 6, 2019
Read Also: ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు
Read Also: జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ
Read Also: RBI గుడ్ న్యూస్ : హోంలోన్ పై EMI ఎంత తగ్గుతుందో తెలుసుకోండి
Read Also: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..
Read Also: డిజిటల్ రాజకీయం: ‘పొలిటికల్ యాడ్స్’పై ఫేస్‌బుక్ కొత్త టూల్
Read Also: ఫీచర్స్ సూపర్ అంట : జియో 3 కమింగ్ సూన్