Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 డేట్, టైమ్ ఇదిగో.. మీ మొబైల్, టీవీలో బడ్జెట్ లైవ్ ఇలా చూడొచ్చు.. బడ్జెట్ PDF డౌన్‌లోడ్ ఎలా?
Union Budget 2026 : ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెడతారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
Union Budget Day 2026 (Image Credit : AI)
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు
- వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2026న సమర్పించనున్నారు
- దూరదర్శన్, యూట్యూబ్, ప్రైవేట్ వార్తా ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్
- బడ్జెట్ PDF కాపీ ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?
Union Budget 2026 : కేంద్ర వార్షిక బడ్జెట్ (2026) ప్రతి ఏడాది ప్రవేశపెడతారు. అయితే, ఈసారి ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ 2026ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్.
అలాగే నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో తాత్కాలిక బడ్జెట్ కూడా ఉంటుంది. బడ్జెట్ తేదీ, సమయం, ఎక్కడ చూడవచ్చు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఫస్ట్ టైమ్ ఆదివారం బడ్జెట్ సమావేశాలు :
సాధారణంగా, బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా జరుగుతాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2026 కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2026 ఆదివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెడతారు. భారత చరిత్రలో కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం రోజున ప్రవేశపెట్టనున్నడం ఇదే మొదటిసారి.
2017 నుంచి దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించిన మార్పు తర్వాత తాత్కాలిక బడ్జెట్‌లు మినహా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. గత ఏడాది 2025లో సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగాన్ని సమర్పించారు.
వరుసగా 9వసారి బడ్జెట్.. కొత్త రికార్డుకు చేరువలో సీతారామన్ :
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కొత్త రికార్డును సృష్టించనున్నారు. ఆమె వరుసగా తొమ్మిదవ బడ్జెట్‌గా రికార్డు సృష్టించనుంది. అంతేకాదు.. భారత ఆర్థిక మంత్రిగా రెండు పర్యాయాలు 10 కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె చేరువలో ఉంటారు.
ఏప్రిల్ 2 వరకు సమావేశాలు :
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ఏప్రిల్ 2, 2026 వరకు జరగనున్నాయి, మధ్యలో విరామం ఉంటుంది. సెషన్ 28 జనవరి 2026న ప్రారంభమై ఏప్రిల్ 2, 2026 వరకు కొనసాగుతుంది. మొదటి దశ ఫిబ్రవరి 13, 2026న ముగుస్తుంది. 9 మార్చి 2026న పార్లమెంటు తిరిగి సమావేశమవుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జనవరి 9న ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్ తేదీ, సమయం :
- కేంద్ర బడ్జెట్ సమర్పణ తేదీ : ఆదివారం, ఫిబ్రవరి 1
- బడ్జెట్ సమర్పణ సమయం : ఉదయం 11 గంటలు
రెండు దశల్లో జరిగే అవకాశం :
- మొదటి సెషన్ : జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13, 2026 వరకు
- రెండో సెషన్ : మార్చి 9 నుంచి ఏప్రిల్ 2, 2026 వరకు
బడ్జెట్ లైవ్ ఎక్కడ చూడవచ్చు? :
బడ్జెట్ లైవ్ మొత్తాన్ని దూరదర్శన్‌తో పాటు భారత ప్రభుత్వ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. అన్ని ప్రైవేట్ న్యూస్ ఛానల్స్ కూడా బడ్జెట్ ప్రజెంటేషన్ ను లైవ్ స్ట్రీమింగ్ చేస్తాయి. యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బడ్జెట్ ప్రజెంటేషన్ లైవ్ చూడవచ్చు.
బడ్జెట్ PDF కాపీ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? :
కేంద్ర బడ్జెట్ కు సంబంధించి సమాచారం పొందాలంటే బడ్జెట్ ప్రసంగం, డాక్యుమెంట్లను అధికారిక వెబ్‌సైట్ (https://www.indiabudget.gov.in/bspeech.php) లేదా యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ ముగిసిన వెంటనే అన్ని పీడీఎఫ్ డాక్యుమెంట్లు అందుబాటులో ఉంటాయి.
బడ్జెట్ సీజన్ ఎప్పుడంటే? :
బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకారం.. బడ్జెట్ సమావేశాలు జనవరి 28, 2026న ప్రారంభమై ఏప్రిల్ 2, 2026 వరకు కొనసాగుతాయి. మొదటి దశ ఫిబ్రవరి 13, 2026న ముగుస్తుంది. పార్లమెంట్ మార్చి 9, 2026న తిరిగి సమావేశమవుతుంది.
