Apple MacBook Air M4 : ల్యాప్‌టాప్ అంటే ఇలా ఉండాలి.. మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై స్పెషల్ డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ రాదు..!
Apple MacBook Air M4 : విజయ్ సేల్స్ ద్వారా ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ M4 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

MacBook Air M4
Apple MacBook Air M4 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆపిల్ ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. విజయ్ సేల్స్‌లో ఆపిల్ లేటెస్ట్ మ్యాక్‌బుక్ (MacBook Air M4) భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
బ్యాంక్ ఆఫర్లతో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ మ్యాక్‌బుక్ సరసమైన ధరకే ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
విజయ్ సేల్స్‌లో M4పై డిస్కౌంట్ ఆఫర్ :
విజయ్ సేల్స్ నుంచి ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M4ను కొనుగోలు చేస్తే.. 16GB ర్యామ్+ 256GB స్టోరేజ్ ధర రూ.91,990కు లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను కంపెనీ రూ.99,900కు ప్రవేశపెట్టింది.
ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.7,910 ఫ్లాట్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ICICI, SBI, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఈ ల్యాప్‌టాప్ ధర రూ.81,990కు సొంతం చేసుకోవచ్చు.
మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై అమెజాన్ డిస్కౌంట్ :
ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్ నుంచి కొనుగోలు చేస్తే ఎలాంటి డిస్కౌంట్ లేకుండా రూ.94,990కు కొనుగోలు చేయవచ్చు. కానీ, బ్యాంక్ ఆఫర్లతో రూ.5వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా చౌకగా కొనుగోలు చేయవచ్చు.
ఎందుకు కొనాలి? :
ఈ కొత్త మ్యాక్‌బుక్ M4 పాత మోడళ్లతో పోలిస్తే.. చాలా అప్‌గ్రేడ్ ఫీచర్లు కలిగి ఉంది. M1తో పోలిస్తే.. రెండింతలు స్పీడ్ ఉంటుందని ఆపిల్ పేర్కొంది. అయితే, M3 నుంచి M4కి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే పెద్దగా తేడా కనిపించదు. మీరు M1 మ్యాక్‌బుక్ ఎయిర్‌ని వాడుతుంటే.. అది అప్‌గ్రేడ్ చేయడం బెటర్.. అద్భుతమైన పర్ఫార్మెన్స్, అనేక స్మార్ట్ ఫీచర్లు, 12MP వెబ్‌క్యామ్ పొందవచ్చు.