Kodak Smart TV : వారెవ్వా.. 43 అంగుళాల కొత్త కోడాక్ స్మార్ట్‌టీవీ భలే ఉందిగా.. ఏఐ ఫీచర్లు మాత్రం కేక.. ధర జస్ట్ ఎంతంటే?
Kodak Smart TV : ఏఐ స్పెషల్ ఫీచర్లతో 43 అంగుళాల కోడాక్ స్మార్ట్‌టీవీ సరసమైన ధరకే లభిస్తోంది. మీ ఇంటిని హోం థియేటర్‌గా మార్చేస్తుంది..

Kodak Smart TV
Kodak Smart TV : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ఆకర్షణీయమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్‌టీవీ వచ్చేసింది. ప్రముఖ కెమెరా కంపెనీ Kodak సరసమైన QLED స్మార్ట్‌టీవీని రిలీజ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్‌టీవీ కోసం రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
43-అంగుళాల స్మార్ట్ టీవీతో మీ ఇల్లు థియేటర్ మాదిరిగా మార్చేయొచ్చు. ఈ స్మార్ట్‌టీవీ 22 భారతీయ భాషలకు సపోర్టు ఇస్తుంది. జియో JioTele OSతో ఫ్రీ- ఇన్‌స్టాల్ అయింది. ఈ కోడాక్ స్మార్ట్‌టీవీ కంపెనీ భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ధరకే ప్రవేశపెట్టింది.
కోడాక్ స్మార్ట్‌టీవీ ధర ఎంత? :
కోడాక్ 43-అంగుళాల QLED స్మార్ట్ టీవీ కేవలం ధర రూ. 18,999 మాత్రమే. భారత మార్కెట్లో అమెజాన్ ఈ స్మార్ట్‌టీవీని విక్రయిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై కంపెనీ బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ జియోటెలీ OS-ఆధారిత స్మార్ట్ టీవీ ప్రత్యేక ఫీచర్ AI-ఆధారిత కంటెంట్ సెలెక్షన్ సిస్టమ్. వివిధ రకాల OTT ప్లాట్‌ఫారమ్‌లు, గేమింగ్ కంటెంట్‌ను అందిస్తుంది.
ఈ QLED స్మార్ట్ టీనీలోని QLED స్క్రీన్ HDR, 1.1 బిలియన్ కలర్లకు సపోర్టు ఇస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్‌టీవీ అంతటా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. CPU అమ్లాజిక్, 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.
ఈ స్మార్ట్ టీవీలో 40W డాల్బీ డిజిటల్ ప్లస్ స్పీకర్లు ఉన్నాయి. పెద్ద స్పీకర్లతో మీ ఇంట్లో సరౌండ్ సౌండ్‌ను పొందవచ్చు. కోడాక్ QLED టీవీలో బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. వాయిస్-యాక్టివేటెడ్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా అనేక యాప్స్ ఫ్రీ-ఇన్‌స్టాల్ అయ్యాయి. ఈ యాప్స్ ద్వారా మీకు కావలసిన కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు.