Aadhaar Update : ఆధార్ కార్డుపై బిగ్ అప్‌డేట్.. ఇకపై ఇంటి వద్దనే ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?

Aadhaar Update : ఆధార్‌ను అప్‌డేట్ చేసే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఇంటి నుంచే పేరు, పుట్టిన తేదీని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.

Aadhaar Update : ఆధార్ కార్డుపై బిగ్ అప్‌డేట్.. ఇకపై ఇంటి వద్దనే ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.. ఎప్పటినుంచంటే?

Aadhaar Update

Updated On : July 7, 2025 / 11:36 AM IST

Aadhaar Update Online : ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా? అతి త్వరలో ఆధార్ కార్డు వివరాలను ఇంటి వద్దనే ఉండి మార్చుకోవచ్చు. ఇప్పటివరకూ ఆధార్ (Aadhaar Update) కార్డులోని చాలా వివరాలను అప్‌డేట్ చేయాలంటే ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, నవంబర్ 2025 నుంచి అలా ఉండదు.

ఆధార్ కార్డుదారులు ఇంటి నుంచి అనేక ముఖ్యమైన వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్ ఆధార్ సర్వీసులను మరింత సౌకర్యవంతంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి లేదా రాకపోకలలో ఇబ్బంది పడుతున్న వారికి ఈ కొత్త విధానం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఏయే వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయొచ్చంటే? Aadhaar Update :
ఇప్పటివరకు, ఆధార్ హోల్డర్లు (myAadhaar) పోర్టల్‌లో పేరు (చిన్న మార్పులు), ఇంటి అడ్రస్, జెండర్, పుట్టిన తేదీ (నిర్దిష్ట పరిమితి) వంటి వివరాలను అప్‌డేట్ చేయగలరు. కానీ, నవంబర్ 2025 నుంచి ఈ పరిధి మరింత విస్తరించనుంది. UIDAI అధికారుల ప్రకారం.. ఇప్పుడు ఆధార్ కార్డులో కొన్ని ముఖ్యమైన వివరాలను ఆన్‌లైన్‌లో కూడా మార్చుకోవచ్చు.

  • స్పెల్లింగ్ కరెక్షన్ వంటి పేరు మార్పులను ఆన్‌లైన్‌లో పూర్తి చేయొచ్చు.
  • పుట్టిన తేదీ అప్‌డేట్ లిమిట్ కూడా పెంచవచ్చు.
  • తండ్రి లేదా భర్త/భార్య పేరు వంటి కుటుంబ సభ్యుల సమాచారం కూడా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయొచ్చు.
  • మరో ఫ్యామిలీ మెంబర్ ఆధార్ ద్వారా కూడా అడ్రస్ అప్‌డేట్ చేయొచ్చు. డాక్యుమెంట్ లేదా సమ్మతి అవసరం.
  • మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ అప్‌డేట్ భవిష్యత్తులో డిజిటల్‌గా అందుబాటులోకి తీసుకురావచ్చు.
  • ప్రస్తుతం, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ విజిట్ చేయడం ద్వారా వీటిని అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ అప్‌డేట్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? Aadhaar Update :

  • మీరు (myAadhaar) పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • OTP వెరిఫికేషన్ తర్వాత డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి.
  • UIDAI సిస్టమ్ నుంచి వెరిఫై తర్వాత అప్‌డేట్ అవుతుంది.

కొన్ని సందర్భాల్లో, పేరు లేదా పుట్టిన తేదీలో పెద్ద మార్పులు వంటివి, వీడియో వెరిఫికేషన్ అవసరం కావచ్చు. అన్ని ఆమోదించాక అప్‌డేట్ చేసిన డిజిటల్ ఆధార్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ ప్రక్రియ 3 రోజుల నుంచి 5 రోజుల్లోగా ప్రాసెస్ చేస్తామని UIDAI చెబుతోంది.

Read Also : FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? హై రిటర్న్స్ అందించే టాప్ 10 బ్యాంకులివే.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందంటే?

ఇవి తప్పక గుర్తుంచుకోవాలి Aadhaar Update :

  • అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లు స్పష్టంగా, వ్యాలీడ్ ఉండాలి. వ్యక్తిగత వివరాలకు మ్యాచ్ అవ్వాలి.
  • ఫేక్ డాక్యుమెంట్లు లేదా తప్పుడు సమాచారం అందిస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఆధార్ నంబర్ తాత్కాలికంగా సస్పెండ్ అవుతుంది.
  • బయోమెట్రిక్ మార్పులకు (ఫింగర్‌ప్రింట్స్, ఐరీష్ స్కాన్ లేదా ఫొటో) ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం. ఆధార్ సర్వీసు సెంటర్‌కు తప్పనిసరిగా వెళ్లాలి.
  • నవంబర్ నాటికి UIDAI కొత్త మార్గదర్శకాలు, ఆమోదించిన డాక్యుమెంట్ల జాబితాను విడుదల చేస్తుంది.
  • ఈ డిజిటల్ సౌకర్యంతో కోట్లాది మంది ఆధార్ హోల్డర్లు ఇంటి నుంచే పేరు, అడ్రస్, కుటుంబ వివరాల వంటి సమాచారాన్ని సవరించుకోవచ్చు.

కోవిడ్ నుంచి డిజిటల్ సర్వీసులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో రద్దీని తగ్గించేందుకు UIDAI ఆన్‌లైన్ అప్‌డేట్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఇప్పటివరకు 140 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. కోట్లాది మంది ప్రజలు ఆధార్ ద్వారా ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్, మొబైల్ సర్వీసులను పొందుతున్నారు.