Vivo X200 Pro Launch : సెక్యూరిటీ ఫీచర్లతో వివో X200 ప్రో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo X200 Pro Launch : వివో ఎక్స్200ప్రో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో రానుంది. వివో ఎక్స్200ప్రో వనిల్లా వివో ఎక్స్200తో పాటు లాంచ్ కానుందని భావిస్తున్నారు.  

Vivo X200 Pro Launch : సెక్యూరిటీ ఫీచర్లతో వివో X200 ప్రో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo X200 Pro Tipped to Get 1.5K Display ( Image Source : Google )

Vivo X200 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎక్స్ లైనప్ త్వరలో రానుంది. వివో X200 ప్రో పేరుతో కొత్త ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. మీడియాటెక్ నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ ప్‌సెట్‌లో రన్ అవుతుంది. ఇటీవలి లీక్ డేటాలో డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ గురించి మరిన్ని వివరాలను అందిస్తుంది. వివో ఎక్స్200ప్రో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో పాటు ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. వివో ఎక్స్200ప్రో వనిల్లా వివో ఎక్స్200తో పాటు లాంచ్ కానుందని భావిస్తున్నారు. వివో ఎక్స్100ప్రోపై అప్‌గ్రేడ్‌లతో రావచ్చు.

Read Also : iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

వివో ఎక్స్200ప్రో స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
వివో ఎక్స్200ప్రో 1.5K రిజల్యూషన్, నారో బెజెల్‌లతో కొద్దిగా కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని పేర్కొంది ఈ ఫోన్ డిస్‌ప్లే 6.7 లేదా 6.8 అంగుళాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వివో ఎక్స్200ప్రో వెరిఫికేషన్ కోసం సింగిల్-పాయింట్ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉండనుంది. కొత్త సిలికాన్ బ్యాటరీ 6,000mAh కాన్ఫిగరేషన్‌ను అందించనుంది. పెరిస్కోప్ లెన్స్‌తో సహా కొత్త ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉండొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ రాబోయే వివో ఎక్స్ సిరీస్ ఫోన్‌కు పవర్ అందిస్తుందని టిప్‌స్టర్ పేర్కొంది.

భారత్‌లో వివో X100ప్రో ధర, ఫీచర్లు :
వివో ఎక్స్100ప్రో కన్నా వివో ఎక్స్200 ప్రో భారీ అప్‌గ్రేడ్స్‌తో వస్తుందని లేటెస్ట్ లీక్ సూచిస్తుంది. భారత మార్కెట్లో గత ధర జనవరిలో ఆవిష్కరించింది. ఈ ఫోన్ సింగిల్ 16జీబీ ర్యామ్+ 512జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ. 89,999కు పొందవచ్చు. ఆస్టరాయిడ్ బ్లాక్ షేడ్‌లో లభిస్తుంది. వివో ఎక్స్100ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్ఓసీపై రన్ అవుతుంది.

వాటర్, డెస్ట్ నిరోధకతకు ఐపీ68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్989 ఒక-అంగుళాల సెన్సార్‌తో కూడిన (Zeiss) బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో వివో ఇన్-హౌస్ ఇమేజింగ్ చిప్ ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కర్వడ్ 6.78-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 100డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Realme V60 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీతో రియల్‌మి V60 సిరీస్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?