రూ.8,990 మాత్రమే : భారీ బ్యాటరీతో Vivo Y11 వచ్చేసింది

  • Published By: sreehari ,Published On : December 25, 2019 / 09:25 AM IST
రూ.8,990 మాత్రమే : భారీ బ్యాటరీతో Vivo Y11 వచ్చేసింది

Updated On : December 25, 2019 / 9:25 AM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్లలో ఒకటైన వివో ఇండియా మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌‌ను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. అదే.. లేటెస్ట్ వెర్షన్ Vivo Y11 స్మార్ట్ ఫోన్ . కంపెనీ పొర్ట్ పోలియోలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కేటగిరీల్లో వివో Y సిరీస్ నుంచి 5,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంది. హాలో ఫుల్ వ్యూ డిస్ ప్లే సహా మరెన్నో స్పెషిఫికేషన్లు ఆకర్షణగా ఉన్నాయి.
VIVO Y11

వివో Y11 ఫీచర్లలో 6.35 అంగుళాల IPS LCD ప్యానెల్ రెజుల్యుషన్ (1544×720 ఫిక్సల్స్) వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే బడ్జెట్ ఒరియెంటెడ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ రన్ అవుతుంది. కెమెరాల విషయానికి వస్తే.. 13MP ప్రైమరీ సెన్సార్ (f/2.2 లెన్స్), 2MP సెకండరీ సెన్సార్ (f/2.4 లెన్స్) డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది.

అదనంగా ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా (f/1.8 లెన్స్) కూడా ఎట్రాక్టీవ్‌గా ఉంది. 3GB ర్యామ్ + 32GB స్టోరేజీ వేరియంట్‌తో పాటు ఇతర ఫీచర్లలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ V4.0, GPS/A-GPS, Micro-USB, USB OTG, ఫింగర్ ఫ్రింట్ స్కానర్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ మరిన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ హ్యాండ్ సెట్ మినరల్ బ్లూ, అగేట్ రెడ్ కలర్ రెండు రంగుల్లో లభ్యం కానుంది.
VIVO Y11

ఇక డిసెంబర్ 25 నుంచి Vivo Y11 స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో రూ.8,990గా లభ్యం కానుంది. ఆఫ్ లైన్ స్టోర్లలో వివో ఇండియా ఈ కామర్స్ స్టోర్, అమెజాన్ ఇండియా, పేటీఎం మాల్, టాటా క్లిక్, బజాజ్ ఈఎంఐ ఈ-స్టోర్లలో కూడా లభ్యం అవుతోంది. డిసెంబర్ 28 నుంచి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో కూడా Vivo Y11 (2019) అందుబాటులో ఉంటుంది.

ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వారికి 6నెలల కాల పరిమితిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కంపెనీ అందిస్తోంది. ఆఫ్ లైన్ కొనుగోలుదారులకు మాత్రం అదనంగా HDFC, ICICI, Axis బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై డిసెంబర్ 31వరకు 5శాతం క్యాష్ బ్యాక్ అదనపు ప్రయోజనం పొందొచ్చు.