Vivo Y36i Launch : అత్యంత సరసమైన ధరకే వివో Y36i వచ్చేసింది.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే..!

Vivo Y36i Launch : కొత్త వివో ఫోన్ వచ్చేసింది. చైనాలో వివో వై36ఐ సిరీస్ మోడల్ డీప్ స్పేస్ బ్లాక్, ఫాంటసీ పర్పుల్, గెలాక్సీ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo Y36i Launch : అత్యంత సరసమైన ధరకే వివో Y36i వచ్చేసింది.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే..!

Vivo Y36i With 13-Megapixel Rear Camera, Dimensity 6020 SoC Launched

Vivo Y36i Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో నుంచి సరికొత్త వై-సిరీస్ ఫోన్ వచ్చేసింది. 13ఎంపీ రియర్ కెమెరాలతో వివో Y36i స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మరింత సరసమైన వెర్షన్‌గా చైనాలో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో మీడియాటెక్ డైమెన్సిటీ6020 చిప్‌సెట్‌ ఆధారిత 4జీబీ ర్యామ్‌తో వస్తుంది.

Read Also : Top 5 Best Camera Smartphones : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో నుంచి గూగుల్ పిక్సెల్ 8 ప్రో.. టాప్ 5 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. వివో వై36ఐ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆర్జిన్ఓఎస్ 3పై రన్ అవుతుంది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో 13ఎంపీ బ్యాక్ కెమెరాతో వచ్చింది. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 15డబ్ల్యూ ఛార్జింగ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

వివో వై36ఐ ధర, లభ్యత :
వివో వై36ఐ ఫోన్ ధర సీఎన్‌వై 1,199 (దాదాపు రూ. 14వేలు) వద్ద కొనుగోలు చేయొచ్చు. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో డీప్ స్పేస్ బ్లాక్, ఫాంటసీ పర్పుల్, గెలాక్సీ గోల్డ్‌ కలర్ ఆప్షన్లతో పాటు సింగిల్ 4జీబీ + 128జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా లిస్టు అయింది.

వివో Y36i స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
కొత్తగా లాంచ్ అయిన వివో Y36i అనేది డ్యూయల్-సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆర్జిన్ఓఎస్ 3 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 20.1:9 స్క్రీన్ రేషియోతో 6.56-అంగుళాల హెచ్‌డీ ప్లస్ (720×1,670 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంబిల్ట్ స్టోరేజ్‌తో పాటు ఆక్టా-కోర్ డైమెన్సిటీ 6020 చిప్‌తో పనిచేస్తుంది.

Vivo Y36i With 13-Megapixel Rear Camera, Dimensity 6020 SoC Launched

Vivo Y36i Launch

వివో Y36i మోడల్ 13ఎంపీ బ్యాక్ కెమెరాతో ఎఫ్/2.2 ఎపర్చరుతో వచ్చింది. వీడియో కాల్‌లు, సెల్ఫీలు తీసుకోవడానికి ఈ ఫోన్ ఎఫ్/1.8 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే కటౌట్‌లో 5ఎంపీ కెమెరాను కలిగి ఉంది. వివో వై36iలోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో పాటు 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

ఈ ఫోన్‌లో యాక్సిలరోమీటర్, ఇ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్‌లు ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 15డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 163.74×75.43×8.09ఎమ్ఎమ్, బరువు 186గ్రాములు ఉంటుంది.

Read Also : Maruti Jimny Sales : కొత్త కారు కొంటున్నారా? మారుతి జిమ్నీపై భారీగా తగ్గింపు.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?