Top 5 Cars Launch : ఈ ఏప్రిల్‌లో రాబోయే టాప్ 5 SUV కార్లు.. టయోటా ఇబెల్లా నుంచి టాటా సియెర్రా EV.. ఫీచర్లు మాత్రం ఖతర్నాక్..!
Top 5 Cars Launch : మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీకోసం మార్కెట్లోకి అతి త్వరలో కొత్త SUV కార్లు లాంచ్ కానున్నాయి. ఏప్రిల్ నెలలో రాబోయే టాప్ 5 కార్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Top 5 Cars Launch
- ఏప్రిల్ 2026లో రాబోయే సరికొత్త SUV కార్లు ఇవే
- వోక్స్వ్యాగన్ టైగన్ నుంచి ఎంజీ మ్యాజెస్టర్ టాప్ 5 కార్లు
- టయోటా సింగిల్ ఛార్జ్‌పై 440 నుంచి 540 కి.మీ రేంజ్
Top 5 Cars Launch : కొత్త కారు కొంటున్నారా? కొద్ది రోజులు ఆగండి. వచ్చే ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లోకి కొత్త SUV కార్లు రాబోతున్నాయి. ఇప్పటికే దేశంలో SUVలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కార్లలో ఎక్కువగా స్పేస్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ పొజిషన్, ఆకర్షణీయమైన డిజైన్ వాహనాలను ఇష్టపడుతున్నారు.
ఈ డిమాండ్ కారణంగా అనేక వాహన తయారీ సంస్థలు సమీప భవిష్యత్తులో కొత్త SUVలను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. పలు ప్రముఖ కంపెనీలతో సహా 5 కొత్త SUV మోడల్స్ కూడా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ కార్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టయోటా ఇబెల్లా :
ఈ లిస్టులో మొదటిది టయోటా ఇబెల్లా. ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఈ కారు మారుతి ఇవిటారా ఆధారంగా రూపొందింది. రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుందని అంచనా. సింగిల్ ఛార్జ్‌పై సుమారు 440 నుంచి 540 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. లోపల బిగ్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఫీచర్లు కూడా చూడవచ్చు.
ఎంజీ మ్యాజెస్టర్ :
ఎంజీ మ్యాజెస్టర్ రెండో అతిపెద్ద ప్రీమియం SUV కారు. ఇందులో లగ్జరీ ఇంటీరియర్, మసాజ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్ డ్రైవింగ్ ఫీచర్లతో పాటు అనేక హై-టెక్ ఫీచర్లు ఉంటాయని అంచనా. పెరిగిన పవర్, పర్ఫార్మెన్స్ అందించే పవర్ఫుల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో రన్ అవుతుంది.
వోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ :
వోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ టైగన్ అప్డేటెడ్ వెర్షన్. ఇందులో కొత్త డిజైన్, మెరుగైన లైటింగ్, కొత్త అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉండవచ్చు. ఇంజన్ ఆప్షన్లు మారనప్పటికీ, కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అందించే అవకాశం ఉంది.
నిస్సాన్ టెక్టన్ :
ఈ ఎస్యూవీ నిస్సాన్ టెక్టన్ కారు రెనాల్ట్ డస్టర్ ఆధారంగా రూపొందింది. కానీ, డిజైన్ మరింత ఆకర్షణీయంగా ప్రీమియంగా ఉంటుంది. పెట్రోల్, హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. మెరుగైన ఇంధన సామర్థ్యం, పర్ఫార్మెన్స్ రెండింటినీ అందిస్తుంది.
టాటా సియెర్రా ఈవీ :
ఈ లిస్టులో టాటా సియెర్రా ఈవీ. కంపెనీ ఐకానిక్ ఎస్‌యూవీకి ఎలక్ట్రిక్ వెర్షన్ కానుంది. ఇందులో భారీ బ్యాటరీ, ఎక్కువ రేంజ్, AWD వంటి ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. కంపెనీ త్వరలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.
