WhatsApp Accounts : 47 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
WhatsApp Accounts Ban : భారత వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ అయ్యాయి. మార్చి 2023లో 4.7 మిలియన్ల భారతీయ వాట్సాప్ అకౌంట్లపై ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ నిషేధం విధించింది.

WhatsApp banned over 47 lakh Indian accounts in March, you could be next
WhatsApp Accounts Ban : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) మార్చి 2023కి యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా నిషేధించిన భారతీయ వాట్సాప్ అకౌంట్ల సంఖ్య, యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. మార్చి 2023లో వాట్సాప్‌లో 47 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లు నిషేధానికి గురయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్ 4(1)(D)కి అనుగుణంగా ఈ అకౌంట్లపై వాట్సాప్ నిషేధం విధించింది.
వాట్సాప్ యూజర్లు భారతీయ చట్టాలను లేదా వాట్సాప్ సర్వీసులు నిబంధనలను ఉల్లంఘించినందున వాట్సాప్ ఈ అకౌంట్లను నిషేధించింది. మార్చి 1 నుంచి మార్చి 31 2023 మధ్య 4,715,906 మంది భారతీయ వాట్సాప్ యూజర్లను నిషేధించింది. ఇందులో దాదాపు 1,659,385 అకౌంట్లను యూజర్ల నుంచి ఫిర్యాదులు అందక ముందే వాట్సాప్ నిషేధించింది. ఈ ప్లాట్‌ఫారమ్ నివారణ, గుర్తింపు పద్ధతులతో మిగిలిన వాట్సాప్ అకౌంట్లపై చర్యలు తీసుకుంది.
మార్చిలో, వాట్సాప్.. గత నెలతో పోలిస్తే అనేక అకౌంట్లను నిషేధించింది. 2023లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య 4,597,400 మంది భారతీయ వాట్సాప్ యూజర్లను ప్లాట్ ఫారంపై నిషేధించింది. ఇందులో దాదాపు 1,298,000 అకౌంట్లను యూజర్ల నుంచి ఫిర్యాదులు అందక ముందే వాట్సాప్ బ్యాన్ చేసింది.
అదనంగా, వాట్సాప్‌కు 4,720 ఫిర్యాదుల నివేదికలు అందాయని లేటెస్ట్ రిపోర్టు వెల్లడించింది. వీటిలో 4,316 బ్యాన్ అప్పీళ్లు రాగా, వాట్సాప్ 553 అకౌంట్లపై మాత్రమే చర్యలు తీసుకుంది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌కు భద్రతకు సంబంధించిన 10 రిపోర్టులు కూడా అందాయి. అయితే, వాట్సాప్ ఏ అకౌంటు పైనా చర్యలు తీసుకోలేదు.

WhatsApp Accounts banned over 47 lakh Indian accounts in March, you could be next
కొన్ని రిపోర్టుల ప్రకారం.. వాట్సాప్ యూజర్ల అకౌంట్లను రివ్యూ చేసిన తర్వాత కంపెనీ బ్లాక్ చేయలేదు. ఎందుకంటే.. వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్లను యాక్సెస్ చేయడానికి, ఏదైనా ఫీచర్‌ను ఉపయోగించడానికి అభిప్రాయాన్ని అందించడానికి హెల్ప్ కావాలి. రిపోర్టు చేసిన అకౌంట్లలో ఏ అకౌంట్ కూడా భారతీయ చట్టాలను లేదా కంపెనీ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించలేదు. వినియోగదారుల ప్రైవసీని సురక్షితంగా ఉంచడానికి ఏఐతో డేటా సైంటిస్టులు, నిపుణులతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుంటామని వాట్సాప్ స్పష్టం చేసింది.
IT రూల్స్ 2021 ప్రకారం.. మార్చి 2023 నెలలో వాట్సాప్ తమ రిపోర్టును వెల్లడించింది. ఈ వినియోగదారు-భద్రతా నివేదికలో స్వీకరించిన యూజర్ల ఫిర్యాదులు, వాట్సాప్ ద్వారా అందుకున్న సంబంధిత చర్యల వివరాలు, ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి వాట్సాప్ సొంత నివారణ చర్యలను చేపడుతోంది. లేటెస్ట్ నెలవారీ రిపోర్టులో వాట్సాప్ మార్చి నెలలో 4.7 మిలియన్లకు పైగా అకౌంట్లను నిషేధించిందని వాట్సాప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Read Also : WhatsApp Chat Transfer : ఆండ్రాయిడ్ యూజర్లు త్వరలో వాట్సాప్ చాట్ ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు..!