Gold: ధర పెరిగినా తగ్గేదిలే..! ఇండియాలో వాళ్లవద్ద రూ.200 లక్షలకోట్ల బంగారం.. పాకిస్థాన్ జీడీపీ కంటే ఆరు రెట్లు ఎక్కువ..

బంగారం కొనుగోళ్లు ఏ మాత్రం తగ్గకపోవటంతో 2026 నాటికి బంగారం ధర ఔన్స్ (28గ్రాముల)కు 3,500 డాలర్లకు చేరుతుందని అంచనా.

Gold: ధర పెరిగినా తగ్గేదిలే..! ఇండియాలో వాళ్లవద్ద రూ.200 లక్షలకోట్ల బంగారం.. పాకిస్థాన్ జీడీపీ కంటే ఆరు రెట్లు ఎక్కువ..

Gold

Updated On : June 22, 2025 / 9:47 AM IST

Gold: బంగారం ధర భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా గోల్డ్ రేటు రికార్డుల ధరలను నమోదు చేస్తుంది. ఇప్పటికే 10గ్రాముల బంగారం రేటు రూ. లక్ష దాటేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ భారతదేశంలో బంగారం కొనుగోళ్ల హవా కొనసాగుతూనే ఉంది.

రికార్డు ధరలు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 782 టన్నులకు చేరింది. కరోనా ముందు స్థాయి యావరేజ్ కంటే 15శాతం ఎక్కువగా ఉంది. నగలకు డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ.. బంగారం బార్స్, కాయిన్లలో పెట్టుబడులు పెరిగాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్వెస్టర్లు వీటిలో చేసిన పెట్టుబడుల విలువ ఏడాది లెక్కన 25శాతం పెరిగింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం డిమాండ్ 725 టన్నుల దగ్గర ఉంటుందని యూబీఎస్ అంచనా వేస్తోంది.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) లెక్కల ప్రకారం.. ఇండియాలో కుటుంబాల దగ్గర ఉన్న బంగారం భారీగా పెరిగిందట. ఇండియాలోని కుటుంబాల్లో, దేవాలయాల దగ్గర సుమారు 25వేల టన్నుల బంగారం ఉంటుందని, దానివిలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం.. 200 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేసిన నామినల్ డీజీపీ అంచనాల్లో ఇది 56శాతం వాటాకు సమానం.

పాకిస్థాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ 411 బిలియన్ డాలర్లు (సుమారు రూ.34లక్షల కోట్లు) అని ఐఎంఎఫ్ 2024-2025లో అంచనా వేసింది. దీన్ని భట్టి భారతదేశంలోని కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ పాకిస్థాన్ జీడీపీ కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఇండియా జీడీపీ నాలుగు ట్రియన్ డాలర్లకు దగ్గరలో ఉంది. అయితే, బంగారం కొనుగోళ్లు ఏ మాత్రం తగ్గకపోవటంతో 2026 నాటికి బంగారం ధర ఔన్స్ (28గ్రాముల)కు 3,500 డాలర్లకు చేరుతుందని అంచనా.