Musk
Elon Musk: 64 కళల్లో సంపాదన కూడా ఒక కళ. ప్రపంచంలో దాదాపు అందరు తమ సంపదను పెంచుకోవాలనే ప్రయత్నిస్తుంటారు. ఉద్యోగం, వ్యాపారం ఏది చేసినా..సంపాదనే లక్ష్యంగా ప్రజలు ఎంతో శ్రమపడుతుంటారు. అయితే ఈ విషయంలో ఎవరైతే ముందు వరుసలో ఉంటారో ఇతరులు సైతం వారినే ఆదర్శంగా తీసుకుంటారు. ఈక్రమంలో సంపదను ఎలా పెంచుకోవాలి? అనే విషయంపై ప్రపంచ అపరకుబేరుడైన ఎలాన్ మస్క్ ఒక సూచన చేశారు. సంపద ఎలా పెంచుకోవాలనే విషయంపై అనేకమంది తరచూ తన సూచనలు కోరుతుంటారని..అయితే వారి వారి నేపధ్యాలు తెలియక ఎటువంటి సూచనలు చేసేవాడిని కానని మస్క్ చెప్పుకొచ్చారు. అయితే స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదన పొందాలనుకునేవారికి మస్క్ ఒక చక్కని సూచన చేశారు.
Also read:Pornography In Parliament : ఛీ..ఛీ.. పార్లమెంటులో పాడు పని.. పోర్న్ వీడియోలు చూసిన ఎంపీ
స్టాక్స్ ను ఎప్పుడు కొనాలి, విక్రయించాలనే దానిపై తన సలహాలను పంచుకున్నారు. ముందుగా “స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటపుడూ భయపడవద్దు” అంటూ మస్క్ ట్వీట్ చేశారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై తాను ఇచ్చే అతిపెద్ద సలహా ఇదేనని మస్క్ పేర్కొన్నారు. ప్రజలు తమ రోజు వారి దినచర్యలో భాగంగా వినియోగించే ఉత్పత్తులు మరియు సేవలను అందించే కంపెనీల స్టాక్ లను కొనుగోలు చేయాలని మస్క్ సలహా ఇచ్చారు. అదే సమయంలో స్టాక్ ఎప్పుడు అమ్మాలి అనే విషయంపై మస్క్ స్పందిస్తూ “ఉత్పత్తులు మరియు సేవలు అధ్వాన్నంగా ఉన్నాయని” వారు భావించినప్పుడు మాత్రమే ప్రజలు తమ స్టాక్లను విక్రయించాలని మస్క్ పేర్కొన్నారు. “ఇది దీర్ఘకాలంలో మీకు బాగా ఉపయోగపడుతుంది” అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
Also read:Permission for Indians: భారత్‌లోఈ ప్రాంతాలకు వెళ్లాలంటే భారతీయులకైనా పర్మిషన్ కావాలి
2022 ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, 268.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. టెస్లా విద్యుత్ కార్ల తయారీ, స్పేస్ఎక్స్ అంతరిక్ష యానం సంస్థలకు యజమాని అయిన మస్క్ ఇటీవల మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన కంపెనీలో టెస్లా విద్యుత్ కార్ల సంస్థ కూడా ఒకటి.
Since I’ve been asked a lot:
Buy stock in several companies that make products & services that *you* believe in.
Only sell if you think their products & services are trending worse. Don’t panic when the market does.
This will serve you well in the long-term.
— Elon Musk (@elonmusk) May 1, 2022