Pornography In Parliament : ఛీ..ఛీ.. పార్లమెంటులో పాడు పని.. పోర్న్ వీడియోలు చూసిన ఎంపీ

పార్లమెంటులో ఓ ఎంపీ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతడి చేసిన పాడు పని తెలిసి ఛీ కొడుతున్నారు. ఏకంగా పార్లమెంటులోనే..(Pornography In Parliament)

Pornography In Parliament : ఛీ..ఛీ.. పార్లమెంటులో పాడు పని.. పోర్న్ వీడియోలు చూసిన ఎంపీ

Pornography In Parliament (1)

Updated On : May 1, 2022 / 6:05 PM IST

Pornography In Parliament : బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటున్న వారు సైతం నీచంగా ప్రవర్తిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే దిగజారిపోతున్నారు. పార్లమెంటులో ఓ ఎంపీ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతడి చేసిన పాడు పని తెలిసి ఛీ కొడుతున్నారు. ఇంతకీ, ఆ ఎంపీ ఏం చేశాడో తెలుసా? ఏకంగా పార్లమెంటులోనే పోర్న్ వీడియోలు చూశాడు.

ఈ షాకింగ్ ఘటన జరిగింది మన దేశంలో కాదు.. బ్రిటన్ లో. అక్కడి అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ నీల్ పరీశ్(65) పార్లమెంటులో అశ్లీల వీడియో చూడటం కలకలం రేపింది. ఎంపీ నీల్ పరీశ్ పోర్న్ వీడియోలు చూస్తుండగా.. ఆయన పక్కనే కూర్చున్న మహిళా సభ్యురాలు గమనించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎంపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.(Pornography In Parliament)

Uttar Pradesh : నర్స్ పై అత్యాచారం, హత్య ?

ఎంపీ నీల్ పరీశ్ తీరుపై విపక్షాలే కాదు సొంత పార్టీ నేతలూ తీవ్రంగా మండిపడ్డారు. ఛీ..ఛీ.. ఇదేం పాడు బుద్ధి అని కసురుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎంపీ నీల్ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తన భార్యకు, కుటుంబసభ్యులకు క్షమాపణ కూడా చెప్పాడు.

UK MP Neil Parish resigns after admitting to watching pornography in parliament

UK MP Neil Parish resigns after admitting to watching pornography in parliament

పార్లమెంటులో అశ్లీల దృశ్యాలు చూసినట్లు వచ్చిన ఆరోపణలపై నీల్ పరీశ్ స్పందించారు. తాను కావాలని చేయలేదని, పొరపాటున ఆ వీడియోలను తెరిచానని ఆయన చెబుతున్నారు. కాగా, ఆయన పోర్న్ చూస్తుండగా తాము చూశామని ఆయనకు సమీపంలో కూర్చున్న ఇద్దరు మహిళా ఎంపీలు ఫిర్యాదుచేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కన్సర్వేటివ్ పార్టీ.. నీల్ ను సస్పెండ్ చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంట్ స్టాండర్డ్స్ కమిషనర్ క్యాథరిన్ స్టోన్ విచారణ చేపట్టారు. ఎంపీల నిబంధనావళిని ఆయన ఉల్లంఘించినట్లు రుజువైతే, సభకు ఆయన క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. ఆపై ఆయనను సస్పెండ్ చేయొచ్చు. లేదా అనర్హత వేటు కూడా వేయొచ్చు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని, దర్యాప్తు పూర్తయ్యే వరకు దీనిపై తాను మాట్లాడబోనని నీల్ పరిశ్ అన్నారు.(Pornography In Parliament)

Woman Gang Rape : రేపల్లే రైల్వే స్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్..భర్తను బెదిరించి అఘాయిత్యం

‘‘ఇది తలవంపులు తెచ్చే ఘటనే. నాకు మాత్రమే కాదు. నా భార్య, కుటుంబం అందరూ ఆందోళన పడుతున్నారు. అదృష్టవశాత్తు ఈ విషయంలో నా భార్య నాకు అండగా నిలిచింది. ఆమెకు ధన్యవాదాలు చెప్పాలి’’ అని నీల్ పరీశ్ అన్నారు. వెర్టన్ అండ్ హోనిటన్‌ల నుంచి ఎంపీగా కొనసాగుతున్న పరీశ్.. పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నప్పటికీ, ఆయన ఈ పదవుల్లో కొనసాగొచ్చు.

UK MP Neil Parish resigns after admitting to watching pornography in parliament

UK MP Neil Parish resigns after admitting to watching pornography in parliament

బ్రిటన్‌లో మే 5న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకే చెందిన నీల్‌ పరీశ్‌ వ్యవహారం కొత్త విమర్శలకు తావిచ్చినట్లైంది. మరోవైపు, కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి పార్టీ చేసుకోవడంపై తీవ్ర విమర్శల పాలైన ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పదవికి రాజీనామా చేయాల్సిందిగా సొంత పార్టీ సభ్యుల నుంచి నీల్‌ పరీశ్‌పై ఒత్తిడి పెరిగింది. రాజీనామా అనంతరం నీల్‌ మాట్లాడుతూ.. వాస్తవానికి తాను ట్రాక్టర్ల వెబ్‌సైట్‌ చూసేందుకు యత్నించానని, అది పొరపాటున నీలిచిత్రాల వెబ్‌సైట్‌కు వెళ్లిందని చెప్పుకొచ్చారు.