Uttar Pradesh : నర్స్ పై అత్యాచారం, హత్య ?
ప్రైవేట్ నర్సింగ్ హోంలో పని చేస్తున్న నర్స్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నర్సింగ్ హోం గోడకు వేలాడుతున్న నర్స్ మృతదేహాన్ని చూసి స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Uttar Pradesh Nurse
Uttar Pradesh : ప్రైవేట్ నర్సింగ్ హోంలో పని చేస్తున్న నర్స్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నర్సింగ్ హోం గోడకు వేలాడుతున్న నర్స్ మృతదేహాన్ని చూసి స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లోని న్యూజీవన్ హాస్పటల్ లో ఒక నర్సు(19) కొత్తగా శుక్రవారమే ఉద్యోగంలో చేరింది. తర్వాత రోజు శనివారం నర్సింగ్ హోం గోడకు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించటం స్ధానికంగా సంచలనం రేపింది.
నర్స్ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు ఘటనా స్ధలానికి వచ్చారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసారని వారు ఆరోపించారు. నర్సింగ్ హోం నిర్వాహకుడితో పాటు మరో ముగ్గురిపై వారు అనుమానం వ్యక్తం చేశారు.
ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగిందా, లేక ఆమెనే ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Nizamabad : అంబులెన్స్ లో ఆవులు సజీవ దహనం