రూ.500 దొంగతనం చేశాడని బాలుడ్ని కొట్టి చంపిన మహిళ

  • Published By: murthy ,Published On : September 24, 2020 / 05:41 PM IST
రూ.500 దొంగతనం చేశాడని బాలుడ్ని కొట్టి చంపిన మహిళ

Updated On : September 24, 2020 / 6:06 PM IST

ఒడిషాలో దారుణం జరిగింది. రూ.500 లు దొంగిలించాడనే ఆరోపణలోతో ఒక మహిళ 14 ఏళ్ల బాలుడ్ని చితక్కొట్టింది, ఆ దెబ్బలకు బాలుడు కన్నుమూశాడు.

ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా పోలీసు స్టేషన్ పరిధిలోని కియపనోపోషి గ్రామంలో నివసించే రాజన్ బెహరా (14) అనే బాలుడు 7వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ కాసేపు ఆడుకున్న తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.



ఆసమయంలో స్నేహితుడి తల్లి సస్మితా బెహరా(36) బజారుకు వెళ్ళింది. రాజన్ తన స్నేహితుడి ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత స్నేహితుడి ఇంట్లో రూ.500 లు కనపడలేదని స్నేహితుడి తల్లి గుర్తించింది. తన కుమారుడు ఏమైనా తీసాడా అని అడిగింది.తాను తియ్యలేదని చెప్పాడు. ఇంటికెవరైనా వచ్చారా అని అడగ్గా తన స్నేహితుడు రాజన్ వచ్చాడని చెప్పాడు.



సస్మితా బెహరా రాజన్ పిలిచి ప్రశ్నించింది. తనకు తెలియదని చెప్పగా ఆమె నమ్మలేదు. కర్రతీసుకుని రాజన్ బెహరాను కొట్టింది. ఆమె కొట్టిన దెబ్బలకు బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఇంటికి వెళ్ళిన బాలుడు మరణించాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు సస్మితా బెహరాపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.