రెచ్చిపోయిన భూకబ్జా దారులు… సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై దాడి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్లలో దారుణం జరిగింది. భూ కబ్జాదారులు పట్టపగలే రెచ్చిపోయారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడికి దిగారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. ప్రభుత్వ స్థలం గురించి ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించాడనే కోపంతో.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హరిప్రసాద్‌పై కొందరు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇంటి వరకు బైక్‌లపై వెంటాడి.. కర్రలతో దాడి చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన హరిప్రసాద్ తల్లికి సైతం ఈ దాడిలో గాయాలయ్యాయి.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని స్కూల్ పిల్లల కోసం ఉపయోగించాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హరిప్రసాద్ అధికారులను భూమి వివరాలు అడిగాడు. ఆర్టీఐ కింద దానికి సంబంధించిన వివరాలను సేకరించాడు.
430 సర్వే నంబర్ ప్రభుత్వ భూమికి సంబంధించిన వివరాలు సేకరించడంతో… కక్ష కట్టిన కబ్జాదారులు హరిప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేశారు నీళ్ల బాటిల్ తెచ్చేందుకు బండిపై బయటకు వెళ్లిన హరిప్రసాద్‌ను ఇంటివరకు బైకుపై ఫాలో అయ్యారు.
https://10tv.in/boy-friend-attacked-by-girl-friend-with-acid/
అతడు ఇంటికి చేరుకోగానే.. ఇంటి గేటు బయటే ఆయనపై దాడికి దిగారు. అడ్డుకున్న తల్లిని కూడా తోసివేశారు. ఈ ఘటనలో హరిప్రసాద్ తల్లికి కూడా గాయాలయ్యాయి. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డ్ కావడంతో తొమ్మిది మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.