నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్ తో యజమానురాలిపై పగ తీర్చుకున్న పనిమనిషి

  • Published By: murthy ,Published On : September 18, 2020 / 06:13 PM IST
నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్ తో యజమానురాలిపై పగ తీర్చుకున్న పనిమనిషి

Updated On : September 18, 2020 / 6:23 PM IST

యజమానురాలిపై పగ తీర్చుకోటానికి  ఆమెపేరుతో నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్ క్రియేట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేసింది ఒక యువతి. ఆ ఫేస్ బుక్ లో యజమానురాలి  ఫోటోతో పాటు ఫోన్ నెంబరు కూడా ఇచ్చి….. అందులో అసభ్య కరమైన, అశ్లీలమైన పోస్ట్ లు పెట్టింది.

శ్రుతి అనే యువతి ఢిల్లీలోని ఒక ఇంట్లో పని చేసేది. కొ్ద్ది నెలల క్రితం ఆమె పని చేస్తున్న ఇంట్లో దొంగతనం చేసిందనే ఆరోపణతో పనిలోంచి తీసివేయబడింది. నేరం రుజువైనప్పటికీ పోయిన వస్తువు దొరకటంతో యజమానులు ఆమె పై కేసు పెట్టకుండా పనిలోంచి తీసి వేసారు.



ఇది సహించలేని శ్రుతి తన యాజమానురాలిని ఇబ్బందులకు గురి చేయాలనుకుంది. అందుకోసం మాల్వియా నగర్ చిరాగ్ ఢిల్లీలో నివసించే తన బోయ్ ఫ్రెండ్ సూరజ్ ను సహాయం కోరింది. శ్రుతి చెప్పిన వివరాలతో సూరజ్ ఆమె యజమానురాలి పేరుతో ఫేస్ బుక్ లో పెయిడ్ సెక్స్ సేవలు లభిస్తాయనే పేరుతో నకిలీ ఎకౌంట్ క్రియేట్ చేశాడు.

అందులో యజమానురాలి ఫోన్ నెంబరు ఇచ్చాడు. దాంతో పాటు కొంత మంది మహిళల అసభ్య కరమైన, అశ్లీలకరమైన అంగాంగ ప్రదర్శన చేసే ఫోటోలు, వీడియోలు ఫేస్ బుక్ లో పెట్టారు.



ఫేస్ బుక్ లో పెట్టిన ఫోన్ నెంబరు ఆధారంగా కొందరు యవకులు యజమాను రాలి ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి వేధించటం మొదలు పెట్టారు. ఫోన్ చేసిన వారు అసభ్యంగా మాట్లాడటంతో యజమానురాలు షాక్ కుగురైంది. అలా ఫోన్ చేసిన ఒకరి ద్వారా ఏం జరిగిందో తెలుసుకుంది.

ఫేస్ బుక్ లో తనపేరుతో  నకిలీ ఐడీ క్రియేట్ చేయబడింది అని తెలుసుకుంది. వెంటనే కొన్ని ఆధారాల సేకరించి గ్రేటర్ ఢిల్లీలోని దక్షిణ కైలాస్ పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢిల్లీలోని చిరాగ్ మాల్వియా ప్రాంతంలో నివసించే సూరజ్ ను అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడు నేరం అంగీకరించాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమీషనర్ అతుల్ ఠాకూర్ చెప్పారు.