తమ్ముడి సర్టిఫికెట్లతో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న అన్న

అన్నదమ్ములిద్దరూ ఒకేలా ఉండటం అతనికి కలిసొచ్చింది. తమ్ముడి విద్యార్హతల సర్టిఫికెట్లతో విద్యుత్ శాఖలో ఉద్యోగం పొందిన అన్న బాగోతం 12 ఏళ్ల తర్వాత వెలుగు చూసింది. అప్పటికీ తమ్ముడు ఫిర్యాదు చేయబట్టి ఈ విషయాన్ని అధికారులు కనుగొన్నారు.
పుష్కర కాలంగా ఉద్యోగం చేస్తున్నా ఎవరికి అనుమానం రాకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. స్వయంగా సోదరుడే ఎన్సీడీసీఎస్ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయటంతో అన్న అసలు రూపం బయట పడింది.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చంద్రశేఖర్ నగర్ కు చెందిన గాదె రవీందర్. గాదె రాందాస్ అన్నదమ్ములు. పన్నెండేళ్ల క్రితం మంధని సబ్ స్టేషన్ లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేసిన రవీందర్ శాశ్వత ఉద్యోగం కోసం తమ్ముడు రాందాస్ కు చెందిన ఐటీఐ సర్టిఫికెట్ లు ఉపయోగించుకున్నాడు. అదే పేరుతో ఉద్యోగం చేస్తూ ప్రమోషన్లు కూడా పొందాడు. ప్రస్తుతం గోదావరిఖని తూర్పు డివిజన్ లో లైన్ మెన్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇటీవల కాలంలో సోదరుల మధ్య ఆస్తి తగాదా మొదలయ్యింది. ఈ క్రమంలో తమ్ముడు రాందాస్….. తన సర్టిఫికెట్లతో అన్న ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ కేసును పట్టించుకోకపోవటంతో….. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించాడు.
https://10tv.in/rafale-fighter-jets-to-be-formally-inducted-into-iaf-on-september-10-french-defence-minister-invited/
వాటిని ఎన్సీడీసీఎల్ విజిలెన్స్ విభాగానికి అందచేశాడు. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి రవీందర్ చేసిన మోసాన్నిగుర్తించి రవీందర్ ను సస్పెండ్ చేశారు. 12 ఏళ్లుగా రాందాస్ పేరుతో ఉద్యోగం చేస్తున్న రవీందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.