వదిన ప్రవర్తన నచ్చక ఆత్మహత్య చేసుకున్న మరిది

కోడలిగా ఇంటికి వచ్చిన వదిన అత్తమామలతో గొడవ పడటం నచ్చని ఒక మరిది ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్ లోని చండీఘర్ రాష్ట్రంలో ఈ దుర్ఘటన జరిగింది. టిబ్బా పోలీసు స్టేషన్ పరిధిలో వ్యాపారం నిర్వహించే 21 ఏళ్ళ యువకుడు శనివారం ఆత్మ హత్య చేసుకున్నాడు. అతని బావ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంటికి కోడలిగా వచ్చిన వదిన తనతోనూ, తన తల్లి తండ్రులతోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ యువకుడు మనస్తాపం చెందాడు. దీంతో తన షాపులో శనివారం జులై24 మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.
శనివారం ఉదయం ఇంటినుంచి షాపు కు వెళ్లాడు ఆ యువకుడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో తండ్రి షాపు వద్దకు వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత సేపు తలుపు కొట్టినా లోపల నుంచి స్పందన లేదు. దీంతో ఆయన చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచి చూశాడు.
అప్పటికే ఆయువకుడు పైకప్పు దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్ధానికులు ఆ యువకుడిని కిందకు దింపారు. కొన ఊపిరితో ఉన్న అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు అక్కడ ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
తన వదిన పెట్టే అవమానాలు భరించలేక పోతున్నానని, ఆమె తన తల్లితండ్రులనూ అవమానిస్తోందని, వారిని చులకనగా చూస్తోందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కోన్నాడు. ఆ మహిళపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ దల్జిత్ సింగ్ తెలిపారు.