హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : December 1, 2020 / 01:03 AM IST
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Updated On : December 1, 2020 / 5:49 AM IST

software employee commits suicide at hyderabad : హైదరాబాద్ లో ఓ సాఫ్టే వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్ లో నివాసం ఉండే స్రవంతి(26) అనే సాఫ్టే వేర్ ఉద్యోగిని ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త రవికిరణ్ కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కుటుంబ కలహాల నేపధ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.