పదిహేనేళ్ల బాలికపై బ్రదర్ అతని ఫ్రెండ్ పది నెలలుగా అత్యాచారం

చంఢీఘడ్ పోలీసులు 19ఏళ్ల వ్యక్తిని, అతని ఫ్రెండ్ ను రేప్ కేసులో అరెస్టు చేశారు. 15సంవత్సరాల వయస్సున్న అతని సోదరినే 10నెలల పాటు అత్యాచారం జరిపి.. గర్భవతి అయ్యేందుకు కారణమయ్యాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక కడుపులో నొప్పి అని కంప్లైంట్ చేయడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పుడూ తెలిసింది ఆ మైనర్ బాలిక ఎనిమిది నెలల గర్భిణీ అని. దాంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.
బాలికను అడిగిన ప్రశ్నల్లో.. పదో తరగతి చదువుతున్న తన సోదరుడు.. అతని స్నేహితుడు కలిసి పలుమార్లు తనపై అత్యాచారం జరిపారని గతేడాది డిసెంబర్ నుంచి ఇలా జరుగుతుందని చెప్పింది. బాధితురాలి అక్కకి ఈ సంవత్సరం జనవరిలో పెళ్లి అయింది. ఆ తర్వాత అంధురాలైన తల్లి ఆమెకు సంరక్షించలేకపోయింది.
డాక్టర్లు ఆ విషయం చెప్పేదాకా కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి అస్సలు తెలియదని పోలీసులకు చెప్పింది ఆ తల్లి. కొడుకు డ్రగ్ కు బానిస అయ్యాడని.. ఇంట్లో తరచూ గొడవలు పడుతుండేవాడని చెప్పింది. 2012లోనే ఆమె భర్త కుటుంబాన్ని వదిలేశాడు. ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం.. పోలీస్ కంప్లైంట్ రిజిష్టర్ చేశారు. ఫ్యామిలీ రిక్వెస్ట్ ప్రకారం.. బాలికను షెల్టర్ హోమ్‌కు పంపించారు.