Fire Breaks out at Hospital
Fire Breaks out at Hospital : ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం గురించి తెలియగానే ఢిల్లీ అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రిలో ఉన్న 20 మంది నవజాత శిశువులను కాపాడి వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
Global Warming : పెరుగుతున్న భూతాపం.. మానవాళికి శాపం
9 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పారు. 20 మంది నవజాత శిశువులను జనక్ పురిలోని ఆర్య ఆసుపత్రి,జేకే ఆసుపత్రి, ద్వారక, న్యూ బోర్న్ పిల్లల ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఢిల్లీ పోలీసులు ఆసుపత్రికి వచ్చి అగ్నిప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.