Cyclone Biparjoy To Intensify: బిపర్‌జాయ్ తుపాన్ మరింత తీవ్రం..ఐఎండీ హెచ్చరిక

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్ తుపాన్ మరింత తీవ్రం కానుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం ట్వీట్‌లో తెలిపింది.ఈ తుపాన్ మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.రాబోయే 36 గంటల్లో దీని ప్రభావం పెరుగుతుందని ఐఎండీ తెలిపింది....

Cyclone Biparjoy To Intensify: బిపర్‌జాయ్ తుపాన్ మరింత తీవ్రం..ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy To Intensify

Updated On : June 9, 2023 / 9:14 AM IST

Cyclone Biparjoy To Intensify: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్ తుపాన్ మరింత తీవ్రం కానుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం ట్వీట్‌లో తెలిపింది.ఈ తుపాన్ మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.జూన్ 8వతేదీ రాత్రి 11:30 గంటలకు గోవాకు పశ్చిమ-నైరుతి దిశలో 840 కిలోమీటర్లు, ముంబయికి పశ్చిమ-నైరుతి దిశలో 870 కిలోమీటర్ల దూరంలో తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా తుపాన్ పయనిస్తుందని వాతావరణశాఖ వెల్లడించింది.

Newlywed couple reunites: ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో కలిసిన నవ దంపతులు

అరేబియా సముద్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోకి మత్స్యకారులు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. సముద్రంలో ఉన్నవారు తీరానికి తిరిగి రావాలని గతంలోనే సూచించింది. రాగల 36 గంటల్లో ఈ తుపాన్ తీవ్రత మరింత పెరిగి గాలులతోపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హచ్చరించారు.