Love Affair : పెళ్లి చేసుకుంటానని వెళ్లిన యువతి ఆదృశ్యం
పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకోటానికి వెళ్లిన యువతి ఆదృశ్యమైన ఘటన మల్కాజ్‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Love Affair : పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకోటానికి వెళ్లిన యువతి ఆదృశ్యమైన ఘటన మల్కాజ్‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్జాలగూడకు చెందిన కాశీనాధ్ కూతురు అనూష(27) ఓ యువకుడిని ప్రేమించింది. ఆ విషయం తల్లి తండ్రులకుచెప్పింది. వారు ప్రేమను అంగీకరించారు. రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటామని చెప్పటంతో, వారు హిందూ వివాహ పధ్ధతిలో కూడా చేసుకోవాలని సూచించారు.
రిజిష్టర్ వివాహాం చేసుకోటానికి ఈనెల17న ఇంటి నుంచి వెళ్లిన అనూష తిరిగి రాలేదు. ఆమె సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావటంతో ఈనెల 20వ తేదీన ఆమె తండ్రి కాశీనాధ్ మల్కాజ్ గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.