Road Accident : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్‌ను  బైక్ వెనక నుండి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

Road Accident : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

Road Accident Nalgonda District

Updated On : January 11, 2022 / 7:53 AM IST

Road Accident :  నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్‌ను  బైక్ వెనక నుండి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.  పోలీసులు తెలిపిన వివరాలు మేరకు…. దామరచర్ల మండల పరిధిలోని అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై.. బోత్తులపాలెం వద్ద వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి బైక్ నుజ్జునుజ్జయింది.

Also Read : Oxygen Infrastructure : ఆక్సిజన్ ప్లాంట్లు,నిల్వలు,సిలిండర్లపై దృష్టి పెట్టండి-మన్సుఖ్ మాండవీయ

ఈఘటనలో   బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న వాడపల్లి పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సమీక్షించారు.  మృతుల్లో ఇద్దరు వాడపల్లి గ్రామానికి చెందిన అంజి(21), అంజలి(17)లు అన్నాచెల్లెలు..వారి  మేనల్లుడు నవదీప్ (8)గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తి దర్యాప్తు చేపట్టారు.