Girl Child Kidnapped In Nellore
Girl Child Kidnapped In Nellore : నెల్లూరు జిల్లాలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో పల్లవి అనే మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. చాముండేశ్వరి గుడి దగ్గర ఆడుకుంటుండగా బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు స్కూటీలో ఎత్తుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్
సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు చిన్న సూలం, పోలమ్మ యాచకులు. ఆదివారం కావడంతో భిక్షాటన కోసం పల్లవిని తీసుకుని గుడి దగ్గరికి వచ్చారు. చిన్నారి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. మహిళా కిడ్నాపర్లు ఎవరు? ఎందుకు ఎత్తుకెళ్లారు? అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.