Covid Restrictions : కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి గ్రాండ్ పార్టీ…37 మంది అరెస్ట్
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ నిర్వహిస్తున్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ పై పోలీసులు దాడిచేసి 37 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించి పార్టీలో పాల్గోన్నారు.

37 Arrested From Top Kolkata Hotel
Covid Restrictions : కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ నిర్వహిస్తున్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ పై పోలీసులు దాడిచేసి 37 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించి పార్టీలో పాల్గోన్నారు.
కొల్ కతాలోని పార్క్ స్ట్రీట్ లోని, ప్రముఖ స్టార్ హోటలైన పార్క్ హోటల్ లో పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం తెల్లవారు ఝూమున గం.1-15 కి హోటల్ దాడి చేశారు. ఈ దాడిలో రెండు అత్యాధునిక కార్లు, 38 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు హుక్కా తాగే సాధనాలు, మ్యూజిక్ సిస్టం లు, మద్యం సీసాలు. గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడి సందర్భంగా కొందరు పారిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.