Child Pornography : ఆ వీడియోలు చూస్తున్నారా..అయితే..జైలుకే

చిన్న పిల్లలతో అసహజంగా చిత్రీకరించిన పోర్న్ వీడియోలు చూస్తున్నారా ? అయితే జైలుకు వెళ్లడానికి రెడీగా ఉండండి.

Child Pornography : ఆ వీడియోలు చూస్తున్నారా..అయితే..జైలుకే

Child

Updated On : September 18, 2021 / 8:35 AM IST

5 Years Of Jail : చిన్న పిల్లలతో అసహజంగా చిత్రీకరించిన పోర్న్ వీడియోలు చూస్తున్నారా ? అయితే జైలుకు వెళ్లడానికి రెడీగా ఉండండి. ఎక్కడున్నా సరే…పోలీసులు వెంటాడుతున్నారు. వీరిని పట్టుకుని కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు. నాలుగైదేళ్లుగా మైనర్లతో చిత్రీకరించిన..పోర్న్ వెబ్ సైట్లను చూసే వారి సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వీటి ప్రభావంతో…మైనార్లపై ఆకృత్యాలు పెరుగుతుండడంతో కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది.

Read More : Death Mystery: ఆ గ్రామంలో ఒకరు చనిపోతే.. వెంటనే మరొకరు చనిపోతున్నారట..!

భారతదేశ వ్యాప్తంగా ఈ వీడియోలను చూస్తున్న వారి గుర్తిస్తున్నారు. సెల్ ఫోన్ లు, ల్యాప్ టాప్, కంప్యూటర్ల ఐపీ చిరునామాల ఆధారంగా..వారిని గుర్తించి..ఆయా రాష్ట్రాలకు పంపుతోంది. దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1095 మందిని అరెస్టు చేశారు. నగర శివారు ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు బ్లూ ఫిల్మ్స్ వెబ్ సైట్లు చూస్తున్న వారిని గుర్తించేందుకు ఈ బ్యూరో సీ సామ్ అనే అమెరికన్ కంపెనీతో నాలుగేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఇస్తున్న వివరాలతో పాటు..అదనంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి జైలుకు పంపుతున్నారు.

Read More :  Today Gold Rate : శుభవార్త.. బంగారం ధర ఢమాల్‌

మొదట ఐదేళ్లు..రెండోసారి ఏడేళ్లు
తొలిసారి దొరికిన వారికి ఐదేళ్ల జైలు, రూ. 10 లక్షల వరకు జరిమాన విధిస్తున్నాయి. రెండోసారి కూడా పోలీసులు అరెస్టు చేస్తే వారికి ఏడేళ్ల పాటు జైలులో ఉండాల్సి వస్తుంది. అంతేగాకుండా రూ. 10 లక్షల జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో రెండేళ్ల క్రితం 16 కేసులు నమోదు కాగా..ఇందులో ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గత సంవత్సరం కూడా 20 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురిపై రెండోసారి కేసులు నమోదయ్యాయి.