కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురి మృతి

కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో… ఏడుగురు మరణించారు. 15 మందికి తీవ్రగాయాలు కాగా మరో 25 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తలించారు. తుమ్కూర్ జిల్లాలోని కోరటగెరే వద్ద ఈ ఘటన జరిగింది.
అక్టోబరు 30 బుధవారం తెల్లవారుఝూమున డ్రయివర్ అతివేగంగా బస్సు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పి బస్సు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. 3 సార్లు పల్టీలు కొట్టి బస్సుతిరగబడిందని చెపుతున్నారు. కొరటగెరే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.