Mobile Phone Explodes(Photo : Google)
Mobile Phone Explodes : ఈరోజుల్లో సెల్ ఫోన్ అందరి జీవితాల్లో భాగమైపోయింది. చిన్న పెద్ద, ధనిక పేద.. అనే తేడా లేదు. అందరి దగ్గరా ఫోన్లు ఉంటున్నాయి. కొంతమంది తిండి, నిద్ర లేకపోయినా ఉండగలరేమో కానీ, ఒక్క సెకన్ కూడా మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. అంతగా ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. ఇక, చిన్న పిల్లలు కూడా మారిపోయారు.
చక్కగా ఆడుకోవాల్సిన వయసులో ఫోన్లకు బానిసలవుతున్నారు. ఫోన్ లో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం పిల్లలకు అలవాటుగా మారింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ ఫోన్ ప్రాణాలకు ప్రమాదంగా మారుతోంది. సెల్ ఫోన్లు బాంబుల్లా పేలిపోతున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా సెల్ ఫోన్ పేలి 8ఏళ్ల చిన్నారి మృతి చెందింది.
Also Read..Viral Video : ఓ మై గాడ్.. రెచ్చిపోయిన దొంగలు, క్షణాల్లో బైకులు చోరీ.. వీడియో వైరల్
కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లా తిరువిల్వమలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఓ చిన్నారిని బలితీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. సెల్ ఫోన్ పేలి ఆదిత్యశ్రీ అనే చిన్నారి మరణించింది. పాప వయసు 8ఏళ్లు. నిన్న రాత్రి మొబైల్ కు చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఫోన్ పేలింది. ఫోన్ ముఖంపై పేలడంతో తీవ్రంగా గాయపడ్డ పాప చనిపోయింది.
ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి ఎక్కువ సేపు ఆడటం వల్లే అది వేడెక్కి పేలి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, చిన్నారి మృతితో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. పాప తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ నిర్లక్ష్యమే కూతురి ప్రాణం తీసిందని భోరున విలపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా పిల్లల ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించాలి.
Also Read..Ice Cream : బాబోయ్.. ఐస్‌క్రీమ్ తిని బాలుడు మృతి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఆదిత్యశ్రీ స్థానిక స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. పాప మృతితో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన అందరిలోనూ ఒకరకమైన భయాన్ని నింపింది.