90ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా కొట్టి అత్యాచారం..కాళ్లు పట్టుకున్నా కనికరించని కామాంధుడు

దేశ రాజధాని ఢిల్లీలో సభ్యసమాజం సిగ్గుపడే దారుణ ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 90 ఏళ్ల వయస్సున్న లేవలేని వృద్ధరాలిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. వృద్ధురాలని కూడా చూడకుండా కామంతో ఘోరాతి ఘోరంగా అత్యాచారానికి తెగబడ్డాడు ఓ యువకుడు. నాయనమ్మ వయస్సులో ఉన్న ఆమెపై ఇటువంటి ఘోరకృత్యానికి పాల్పడివాడు నిజంగా మనిషి రూపంలో ఉండే రాక్షసుడు.
https://10tv.in/father-who-killed-son-rs-30/
బాబూ..నువ్వు నా మనుమడిలాంటివాడివి..నేను ముసలిదాన్ని..నన్ను వదిలేయ్ బాబూ అని అతిదీనంగా ఆ వృద్ధురాలు వేడుకుంటున్నా..ప్రాధేయపడినా..కాళ్లావేళ్లా పడినా ఆ కామాంధుడికి దయ కలగలేదు…సరికదా..మాట్లాడావంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ ఆమెను ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు..పాపం దెబ్బలకు తాళలేక విలవిల్లాడిపోతున్న ఆ 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు 33 ఏళ్ల యువకుడు. ఈ దారుణ ఘటన మంగళవారం (సెప్టెంబర్ 8,2020) ఢిల్లీలోని నజఫర్ నగర్ లోని రేవ్లా ఖాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో వృద్ధురాలు ఇంటి బైట నిలబడి పాలవాడి కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికొచ్చి ఏంటి ఎవరు కోసం చూస్తున్నావని అడిగాడు. పాలవాడి కోసం అని చెప్పింది. దానికి అతను పాలవాడి దగ్గరకు తీసుకెళతానని చెప్పి..రేవ్లా ఖాన్పూర్ గ్రామం సమీపంలోని వ్యవసాయ పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. దాంతో ఆమె వణికిపోయింది. బాబూ నేను మీ అమ్మమ్మ..నాయనమ్మలాంటిదాన్ని ముసలిదాన్ని బాబూ అని బతిమాలుకుంది. కానీ వినని ఆ కామాంధుడు ఆమెను కొట్టి అత్యాచారం చేసి చంపేద్దామని అనుకునేలోగా ఆమె పెద్దగా కేకలు వేసింది.
వృద్ధురాలి కేకలు..ఏడుపులు విన్న కొంతమంది స్థానికులు పరుగు పరుగున వచ్చి చూసేసరికి ఓ వ్యక్తి పారిపోతూ కనిపించాడు. కొంతమంది బాధితురాలి దగ్గరకు రాక ఇంకొంతమంది పారిపోతున్న ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అపస్మారకస్థితిలో పడి ఉంది. దీంతో జరిగిన ఘోరం ఊహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా..వెంటనే వచ్చిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
కాగా..వృద్ధురాలనికి పరీక్షించిన డాక్టర్లు ఆమె ప్రైవేటు భాగాలు దెబ్బతిన్నాయని..దారుణంగా పాడయ్యాయని 90ఏళ్ల వయస్సులో అత్యాచారానికి గురికావటంతో ఇలా జరిగిందని తెలిపారు. వృద్ధురాలిపై అత్యాచారం చేసిన నిందితుడిని రేవ్లా ఖాన్పూర్ గ్రామానికి చెందిన సోను అనే 33ఏళ్ల్యువకుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.