Wife Harassment: భార్య వేధిస్తోందని 70ఏళ్ల భర్త ఫిర్యాదు .. కోర్టు ఆదేశాలతో దిగొచ్చిన పోలీసులు

భార్య వేధిస్తోందని ఓ భర్త పోలీసులకు వద్దకు వెళ్లాడు. కానీ పోలీసులు మాత్రం భర్త చెప్పిన విషయాలు విని కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. ఈ ఘటన మైసూరులో చోటు చేసుకుంది

Wife Harassment: భార్య వేధిస్తోందని 70ఏళ్ల భర్త ఫిర్యాదు .. కోర్టు ఆదేశాలతో దిగొచ్చిన పోలీసులు

Wife and Husbhand Fight

Updated On : November 28, 2022 / 9:55 AM IST

Wife Harassment: భార్య వేధిస్తోందని ఓ భర్త పోలీసులకు వద్దకు వెళ్లాడు. కానీ పోలీసులు మాత్రం భర్త చెప్పిన విషయాలు విని కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. ఈ ఘటన మైసూరులో చోటు చేసుకుంది. మైసూరు వివి పురం పరిధిలోని విజయనగరంలో ఎం. రఘు కారియప్ప (70). భార్య జాస్మిన్ తో నివాసముంటున్నాడు. ఆమె టీచర్ గా పనిచేస్తుంది. అయితే ఆమె తనను వేధిస్తోందని, గత ఐదేళ్ల నుంచి ఆమె తన మాట వినకుండా తన వద్ద బంగారాన్ని దొంగిలించిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Wife Harassment : భార్య వేధింపులతో బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం

రఘు కారియప్ప చెప్పిన మాటలను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఏకంగా కోర్టులో అర్జీ వేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 15న ఆరు బంగారు ఉంగరాలు, రెండు బంగారు నాణేలు, ఒక గోల్డ్ చైన్, ఒక పెద్ద గాజును తన భార్య తనకు తెలియకుండా తీసుకుందని భర్త కోర్టుకు తెలిపాడు. నగలు ఏవని తన భార్యను ప్రశ్నిస్తే నేనే తీసుకున్నానని ఒప్పుకుందని, కానీ, వాటిని తిరిగి ఇవ్వాలని కోరితే మాత్రం ఇవ్వడం లేదని వాపోయాడు.

Ayodhya Kissing Wife : అయ్యో పాపం.. నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను ఉతికారేసిన జనం.. వీడియో వైరల్

తన భార్య వద్ద ఉన్న బంగారం తనకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవటం లేదని కోర్టుకు తెలిపాడు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారించాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, భార్య మాత్రం తాను తన భర్త వద్ద ఎలాంటి బంగారం తీసుకోలేదని పోలీసులకు తెలపడం కొసమెరుపు.