ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదేమో : రూ.లక్ష విలువైన బంగారు నెక్లెస్ లంచంగా తీసుకుంటూ దొరికిపోయింది

లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుంటున్న డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మీ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. ఓ బ్లడ్ బ్యాంక్‌కు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 01:50 PM IST
ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదేమో : రూ.లక్ష విలువైన బంగారు నెక్లెస్ లంచంగా తీసుకుంటూ దొరికిపోయింది

Updated On : October 13, 2019 / 1:50 PM IST

లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుంటున్న డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మీ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. ఓ బ్లడ్ బ్యాంక్‌కు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు

లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుంటున్న డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మీ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. ఓ బ్లడ్ బ్యాంక్‌కు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు లక్ష్మీ లంచం డిమాండ్ చేసింది. దీంతో బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో లక్ష్మీ లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టుబడింది. 

దీపావళి పండుగకు బంగారు నెక్లెస్ కావాలని అడిగి మరీ చేయించుకొని బాధితుడి నుంచి తీసుకొంటూ… డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ ఏసీబీకి చిక్కింది. మాదాపూర్‌లోని సూర్యా అపార్ట్‌మెంట్‌లో లక్షా పదివేల రూపాయల విలువైన బంగారు నెక్లెస్ తీసుకొంటుండగా ఏసీబీ అధికారులకు దొరికింది. బోయిన్ పల్లికి చెందిన జనని వాలంటరీ బ్లడ్ బ్యాంక్‌పై డ్రగ్ కంట్రోల్ అధికారులకు తనిఖీ నివేదిక పంపకుండా ఉండేందుకు ఆ సంస్థ సీఈవో లింగంపల్లి లక్షిరెడ్డిని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి లంచం డిమాండ్ చేసింది.

తొలి విడతగా అక్టోబర్ 5న రూ.50వేలు తీసుకుంది. ఆ తర్వాత దీపావళి గిఫ్ట్‌గా బంగారు నెక్లెస్ కావాలని డిమాండ్ చేసింది. దీంతో… బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు… ఏసీబీని ఆశ్రయించడమే కాకుండా… షాపులోకి వెళ్లినప్పటి నుంచి బంగారు ఆభరణాలు తీసుకునే వరకు అన్నింటిని రికార్డ్ చేశారు. ఇప్పుడా వీడియో బయటికి వచ్చింది.

తాను కోరుకున్న నెక్లెస్ ను ఎంచుకునేందుకు బ్లడ్ బ్యాంక్ సీఈవో లక్ష్మిరెడ్డితో కలిసి డ్రగ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మి గోల్డ్ షాప్ కి వెళ్లినప్పుడు వీడియో తీశారు. ఈ వీడియోని లక్ష్మీరెడ్డి తరఫు వ్యక్తులే తీసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5న రూ.50వేలు లంచం తీసుకున్నా.. అధికారిని ఆశ తీరలేదు. ఆ తర్వాత గోల్డ్ నెక్లెస్ ఇవ్వాలని పట్టుబట్టింది. దాంతో ఆమె అడ్డంగా బుక్ అయ్యింది.