ACB Raids : ఏసీబీ అధికారులకు చిక్కిన పెద్దపల్లి ఆర్డీవో
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ గా వ్యవహరిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

ACB Raids
ACB Raids : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ గా వ్యవహరిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో కాంట్రాక్టర్ గైక్వాడ్ రజనీకాంత్ ఇచ్చిన లక్ష రూపాయల లంచం సొమ్ములు తన బంధువు ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గత కొన్ని రోజులుగా చేసిన పనులకు గాను బిల్లులు చెల్లించేందుకు కమిషనర్ శంకర్ కుమార్ ఇబ్బంది పెడుతున్నాడు. తగిన పర్సంటేజ్ ఇస్తేనే సంతకం పెడతానని చెప్పినట్లు తెలుస్తున్నది. లక్ష రూపాయల లంచం ఇచ్చేందుకు అంగీకరించిన రజనీకాంత్ కరీంనగర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు.
Also Read : Extra Marital Affair : వివాహేతర సంబంధం…రాత్రి 11-30కి ప్రియుడికి అన్నం తీసుకెళ్లిన మహిళ….!
అధికారులు మధ్యాహ్నం నుంచి ఆర్డీఓ కార్యాలయం పరిసరాల్లో వేచి ఉన్నారు. రజనీకాంత్ ఆర్డివో ను కలిసి లక్ష రూపాయలు ఇవ్వబోగా ఆ నగదు ను మరొక వ్యక్తికి ఇవ్వాలని సూచించారు. లంచం డబ్బులను రజనీ కాంత్ శంకర్ కుమార్ బంధువులకు ఇచ్చారు. సదరు వ్యక్తి వెంటనే ఆ డబ్బులను ఆర్డీవోకు అందజేయగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దర్ని పట్టుకున్నారు.