Honey Trap : పాకిస్తాన్ మహిళ హానీట్రాప్‌లో చిక్కుకున్న ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి

పాకిస్తాన్ కు చెందిన మహిళ విసిరిన వలపు వలలో చిక్కుకున్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి   దేశ రక్షణకు చెందిన రహస్యాలను  ఆమెకు చేరవేశాడు. దీంతో మిలటరీ ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి  విచారిస్తున్నారు.

Honey Trap : పాకిస్తాన్ మహిళ హానీట్రాప్‌లో చిక్కుకున్న ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి

Honey Trap

Updated On : May 13, 2022 / 8:33 PM IST

Honey Trap :  పాకిస్తాన్ కు చెందిన మహిళ విసిరిన వలపు వలలో చిక్కుకున్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి   దేశ రక్షణకు చెందిన రహస్యాలను  ఆమెకు చేరవేశాడు. దీంతో మిలటరీ ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి  విచారిస్తున్నారు.

ఢిల్లీ లోని సుబ్రతో పార్క్ లోని ఎయిర్ ఫోర్స్ రికార్డ్ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సార్జంట్ దేవేంద్ర శర్మ అనే వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా  పాకిస్తాన్ కు చెందిన మహిళ పరిచయం అయ్యింది.  ఆమె విసిరిన హానీ‌ట్రాప్‌లో   చిక్కుకున్న   శర్మ  వైమానికదళ   సిబ్బందికి సంబంధించిన  సున్నితమైన  సమాచారాన్ని ఆమహిళకు చేర వేశాడు.

ఈ సమాచారం ఇచ్చినందుకు ఆ మహిళ వద్ద నుంచి శర్మ డబ్బులు కూడా తీసుకున్నట్లు తేలింది.  నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న మిలటరీ ఇంటిలిజెన్స్ అధికారులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈనెల 6వ తేదీన శర్మను అదుపులోకి తీసుకుని విచారించ సాగారు.

గత వారం రోజులుగా శర్మ ద్వారా ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాత  అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ లీకేజీ వ్యవహారం బయటకు రావటంతో శర్మను ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కోన్నారు.

Also Read :India: రష్యాపై తీర్మానం.. ఐరాసలో ఓటింగ్‌కు భారత్ దూరం