రాకేష్ రెడ్డిపై మరో కేసు : ప్రగతి రిసార్ట్స్ ఎండీ జీబీకే రావుకు బెదిరింపులు
జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది.

జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది.
హైదరాబాద్ : జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. ప్రగతి రిసార్ట్స్ ఎండీ జీబీకే రావు అతనిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీబీకే రావును బెదిరించి డాక్యుమెంట్లపై రాకేశ్ రెడ్డి సంతకాలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. డాక్యుమెంట్ల ఆధారంగా రాకేశ్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఈమేరకు జీబీకే రావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జీబీకే రావు సతీమణి, కుమారుడిని చంపుతానని రాకేష్ రెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు చెప్పొద్దని బెదిరించడంతో సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. రాకేశ్ రెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో దొరికిన పత్రాల్లో జీబీకే రావు పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి, విచారణ కూడా చేపట్టారు. కీలక విషయాలను రాబట్టిన విషయం తెలిసిందే.