AP Skill Development Scam : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం-ఘంటా సుబ్బారావు రిమాండ్ రిపోర్ట్ లో సీఐడీ కీలక అంశాలు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో నిధులు పక్క దారి పట్టిన కేసులో ఏ-1 నిందితుడు ఘంటా సుబ్బారావును నిన్న సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Ghanta Subbarao Remand Report
AP Skill Development Scam : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో నిధులు పక్క దారి పట్టిన కేసులో ఏ-1 నిందితుడు ఘంటా సుబ్బారావును నిన్న సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుబ్బారావు రిమాండ్ రిపోర్ట్ లో సీఐడీ అధికారుల కీలంకాంశాలు పేర్కోన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో రూ. 241 కోట్ల కుంభకోణం జరిగిందని సీఐడీ పేర్కోంది. సుబ్బారావు అతి ముఖ్యమైన ఫైల్స్‌ను లేకుండా డిలీట్ చేశారని…. సుబ్బారావు అరెస్ట్ జరగకుండా ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేసి..మిగిలిన ఆధారాలను నాశనం చేసే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్ట్ లో సీబీఐ తెలిపింది.
కనీసం 10 సంవత్సరాలు శిక్షపడే నేరాలు జరిగాయని…సుబ్బారావు మరోక నేరం చేయకుండా ఉండేందుకే అరెస్ట్ చేసామని సీఐడీ తెలిపింది. ఈకేసు విచారణలో సెక్రటేరియట్ నుంచి అత్యంత కీలక డాక్యుమెంట్లు సేకరించాల్సి ఉందని సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కోన్నారు.
Also Read : Sadhvi Saraswati : హిందువులంతా కత్తులు చేతబట్టాలి..సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యలు
సుబ్బారావును అరెస్ట్ చేయకపోతే ఏ-1 గా ఉన్ననిందితుడు అవసరం అయినప్పుడు కోర్టుకు హాజరు కాకపోవచ్చని సీఐడీ అభిప్రాయ పడింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ కన్విల్కర్ లకు లాభం చేకూర్చేందుకు ఘంటా సుబ్బారావు పనిచేసారని సీఐడీ తన రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించింది.