Dead Body Moved In Wheelchair : మహబూబాబాద్ జిల్లా గార్ల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం..అంబులెన్స్ దొరకక వీల్‌చైర్‌లో మహిళ మృతదేహం తరలింపు
మహబూబాబాద్ జిల్లా గార్లలో దారుణం జరిగింది. అంబులెన్స్ దొరకక ఓ మహిళ మృతదేహాన్ని వీల్‌చైర్‌లో తరలించారు. గార్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్మూరి పద్మ మృతి చెందింది. అయితే మృతదేహాన్ని ఇంటికి తరలిద్దామంటే అందుబాటులో అంబులెన్స్‌లు లేవు. ప్రైవేటు వాహనదారులు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు.

Dead Body Moved In Wheelchair
Dead Body Moved In Wheelchair : మహబూబాబాద్ జిల్లా గార్లలో దారుణం జరిగింది. అంబులెన్స్ దొరకక ఓ మహిళ మృతదేహాన్ని వీల్‌చైర్‌లో తరలించారు. గార్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్మూరి పద్మ మృతి చెందింది. అయితే మృతదేహాన్ని ఇంటికి తరలిద్దామంటే అందుబాటులో అంబులెన్స్‌లు లేవు. ప్రైవేటు వాహనదారులు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు.
దీంతో చేసేది లేక.. నలుగురు యువకుల సాయంతో వీల్‌చైర్‌లో మహిళ మృతదేహాన్ని ఇంటికి తరలించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆర్మూరి పద్మ… గార్ల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అయితే అక్కడి వైద్యులు తమ ఆస్పత్రిలో సౌకర్యాలు లేవని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. లేదంటే మహబూబాబాద్ ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు.
ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పద్మ.. అక్కడ చెట్టుకిందే కూర్చుండిపోయింది. రెండు గంటల తర్వాత ఆమె అక్కడే తుదిశ్వాస విడిచింది. చివరకు మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ దొరకక పోవడంతో.. మూడు కిలోమీటర్ల దూరం వీల్‌చైర్‌లో మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది.