వరంగల్‌లో దారుణం : విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

  • Published By: chvmurthy ,Published On : February 27, 2019 / 05:35 AM IST
వరంగల్‌లో దారుణం : విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

Updated On : February 27, 2019 / 5:35 AM IST

వరంగల్: వరంగల్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తన తోటి విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హన్మకొండ, నయూమ్ నగర్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న రవళి అనేవిద్యార్ధినిపై అదే కాలేజీలో చదువుతున్న అన్వేష్ అనే విద్యార్ది బుధవారం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రవళి స్వస్ధలం సంగెం మండలం రామచంద్రాపురం.బుధవారం ఉదయం రవళి కాలేజీకి వెళ్తున్న సమయంలో సాయి అన్వేష్‌ అనే విద్యార్ధి రవళిపై ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన వారిని అన్వేష్ బెదిరించాడు.  

80 శాతం కాలిన గాయలతో ఉన్న రవళిని స్దానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవళి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రవళి తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.