జగిత్యాలలో కాంగ్రెస్ కౌన్సిలర్‌పై కత్తులతో దాడి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. కాంగ్రెస్ కౌన్సిలర్ శ్రీనివాస్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలోనే శ్రీనివాస్‌పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్టు శ్రీనివాస్ చెబుతున్నారు.