ఒంటరి ఆంటీ..10 మందితో అఫైర్ ..ఆ టైమ్ లో ఫోన్లు మోగటంతో హత్య చేసిన ప్రియుడు

  • Published By: chvmurthy ,Published On : March 9, 2020 / 06:52 AM IST
ఒంటరి ఆంటీ..10 మందితో అఫైర్ ..ఆ టైమ్ లో ఫోన్లు మోగటంతో హత్య చేసిన ప్రియుడు

Updated On : March 9, 2020 / 6:52 AM IST

విశృంఖల శృంగారం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం కొన్ని చోట్ల ప్రకటనలు ఇస్తూ ఉంటుంది….సుఖవ్యాధులు వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇలాంటి ప్రకటనలు ఇస్తుంది. కానీ విశృంఖల శృంగారానికి అలవాటు పడిన తమిళనాడు కు చెందిన మహిళ ప్రియుడి చేతిలో హతమైంది. ఆమెతో బెడ్ రూంలో కామకలాపాల్లో మునిగి ఉన్న సమయంలో అదే పనిగా ఫోన్ మోగటంతో చిరాకెత్తిన ప్రియుడు  ఆమెను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. కోపం తీరక పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కేసు విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 

illegal affair 3

తమిళనాడులోని తిరుప్పూరు జిల్లా పల్లడమ్ ప్రాంతానికి చెందిన సెల్వీ @ బేబీ(30) తూత్తుకుడిలోని ముత్తయాపురంలో ఒక ప్రైవేటు సంస్ధలో పని చేస్తోంది. ఆమెకు భర్త లేకపోవటంతో నేతాజీ నగర్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. అడ్డు చెప్పేవారు లేక పోవటంతో ఆమె పలువురు మగవాళ్లతో పరిచయాలు పెంచుకుని వారితో స్వేఛ్ఛగా తిరగటం మొదలెట్టింది. అందులో కొందరితో ఆమె శారీరక సంబంధం కూడా  పెట్టుకుంది. 

ఇందులో తాను పనిచేసే సంస్ధలో ఉద్యోగులతో పాటు తాను నివాసం ఉండే ప్రాంతంలోని మరికొందరితోనూ ఆమె సంబంధాలు పెట్టుకుంది. అవకాశం ఉన్నంతవరకు ఆమె ప్రతిరోజు ప్రియుళ్లతో లైంగిక సుఖాన్ని అనుభవిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. రోజుకొక మగాడు ఇంటికొచ్చి వెళ్లటం చూసిన ఇంటి ఓనర్ సెల్వీని ఇల్లు ఖాళీ చేయించాడు. ఈ క్రమంలో ఆమె నేతాజీ నగర్ లోనే మరోక ఇంటిని అద్దెకు తీసుకుని నివసించసాగింది. అదే ప్రాంతానికి చెందిన ఎడ్విన్ అనే వ్యక్తితో ఆమె అప్పటికే అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఆ ఏరియాలోని ఎడ్విన్ తో కాక మరికొందరితో కూడా ఆమె ఎఫైర్ కొనసాగిస్తోంది. 

See Also | 18 ఏళ్ల యువతిని పెళ్ళి చేసుకున్న 48 ఏళ్ల కామబాబా అరెస్ట్

ఇది తెలిసిన ఎడ్విన్ ఆమె మకాం అక్కడి నుంచి మార్చి వివేకానంద నగర్ లో ఇల్లుతీసుకున్నాడు.  అక్కడ ఆమెతో సహజీవనం చేయటం  ప్రారంభించాడు. నేతాజీ నగర్ నుంచి వివేకానంద నగర్ కు ఇల్లు మారే సమయంలో సెల్వీకి కురప్పసామి (31) అనే ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. ఇల్లు మారే సమయంలో తక్కువ కిరాయి తీసుకుని కురప్పసామి  సామాన్లు చేర వేశాడు. ఈ క్రమంలో అతని ఫోన్ నెంబరు తీసుకుని తరచూ అతడితో మాట్లాడటం మొదలెట్టింది.  క్రమేపి అది వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి  దారితీసింది.  గతవారం ఎడ్విన్ పనిమీద వేరే ఊరు వెళ్ళాడు. ఆరోజు ఒంటరిగా ఉన్న సెల్వీ తన కొత్త ప్రియుడు కురప్పసామి ని రమ్మని పిలిచింది. 

రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చిన కురప్పసామితో  సెల్వీ శృంగారం మొదలెట్టింది.  ఆదే సమయంలో ఆమె ఫోన్  రింగయ్యింది. అప్పుడు ఫోన్ కట్ చేసింది. ఇంతలో మళ్లీ ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. ఇలా ఆమె ఫోన్ కు వరుసగా కాల్స్ రావటం మొదలవటంతో  కురప్పసామికి  చిరాకెత్తింది. పోన్ స్విఛ్చాఫ్ చేయమని సెల్వీని కోరాడు. దానికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో ఆగ్రహానికి గురైన కురప్పసామి సమీపంలోని కత్తి తీసుకుని ఆమె గొంతు కోశాడు. తీవ్రంగా రక్తస్రావం కావటంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.  ఆమె శవంపై పెట్రోల్ పోసి దహనం చేసి కురప్పసామి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 

మర్నాడు ఉదయం ఆమె ఇంటినుంచి దుర్వాసన రావటంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు సెల్వి ఇంటికి వచ్చి చూడగా సగం కాలిపోయిన  ఆమె మృతదేహం  కనపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.  ఫోన్ లోని కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు కురప్పసామి ని అదుపులోకి తీసుకున్నారు.  విచారణలో తానే సెల్వీ ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.  సెల్వీ హత్యకేసు విచారించే సమయంలో స్దానికులు సంచలన విషయాలు బయటపెట్టారు.  

ఆమె ఇంటికి సుమారు 10 మంది మగవాళ్లు  దాకా వచ్చి వెళుతూ ఉంటారని…వారంతా ఆమెతో ఏకాంతంగా గడుపతూ ఉంటారని చెప్పారు. సెల్వీ ఇంటికి వచ్చిపోయే మగవాళ్లలో కొందరు స్థానికంగా ఉన్న మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించటంతో  అనేక సార్లు గొడవలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆటో డ్రైవర్ కురప్పసామిని అరెస్టు చేసిన పోలీసులు ఆమెతో సహజీవనం చేస్తున్న ఎడ్విన్ కోసం గాలిస్తున్నారు.

illegal affair