Bank Manager found dead : పని ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు మేనేజర్ బలవన్మరణం

విధి నిర్వహణలో పని ఒత్తిడి తట్టుకోలేక ఓ బ్యాంకు మేనేజర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో చోటుచేసుకుంది.

Bank Manager found dead : పని ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు మేనేజర్ బలవన్మరణం

Kerala Bank Manager Ends Life

Updated On : April 11, 2021 / 12:39 PM IST

Bank Manager found dead inside bank in Kerala, note says work pressure : విధి నిర్వహణలో పని ఒత్తిడి తట్టుకోలేక ఓ బ్యాంకు మేనేజర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో చోటుచేసుకుంది.

త్రిశూర్ జిల్లాలోని మన్నూతి కి చెందిన స్వప్న(38) బ్యాంకు లో ఉద్యోగం చేస్తోంది. ప్రమోషన్ మీద గతేడాది సెప్టెంబర్ లో కూతుపరంబా లోని, తొక్కిలంగడి కెనరాబ్యాంక్ కు మేనేజర్ గా బదిలీ అయి వచ్చింది.

నిర్మలగిరి లో అద్దెకు ఇల్లు తీసుకుని తన ఇద్దరు కూతుళ్లతో జీవిస్తోంది. స్వప్న భర్త రెండేళ్ళ క్రితం చనిపోయాడు. శుక్రవారం ఏప్రిల్9, ఉదయం గంటల సమయంలో బ్యాంకుకు వచ్చిన మరో మహిళా ఉద్యోగి మేనేజర్ రూంలోకి వెళ్లి చూసింది.

అప్పటికే స్వప్న ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వెంటనే బ్యాంకు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం తెలుసుకున్నస్ధానికులు, పోలీసులు  బ్యాంకు వద్దకు వచ్చి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఈనిర్ణయం తీసుకున్నట్లు స్వప్న అందులో పేర్కోంది.పోస్టుమార్టం  నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.