Stabbing : ముప్పై ఏళ్ల తర్వాత టీచర్ పై పగ తీర్చుకున్న విద్యార్ధి

క్లాస్ రూమ్ లో తనను తక్కువ చేసిన ఉపాధ్యాయురాలిపై పగ పెంచుకున్న ఒక విద్యార్ధి 30 ఏళ్ల తర్వాత ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. 16 నెలలుగా కేసు కొలిక్కిరాలేదు,

Stabbing : ముప్పై ఏళ్ల తర్వాత టీచర్ పై పగ తీర్చుకున్న విద్యార్ధి

Stabbing

Updated On : March 18, 2022 / 1:49 PM IST

Stabbing : క్లాస్ రూమ్ లో తనను తక్కువ చేసిన ఉపాధ్యాయురాలిపై పగ పెంచుకున్న ఒక విద్యార్ధి 30 ఏళ్ల తర్వాత ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. 16 నెలలుగా కేసు కొలిక్కిరాలేదు, నిందితుడు పోలీసులకు పట్టుబడకుండా సాక్ష్యాలు దొరక్కుండా హత్య చేశాడు. నిందితుడు 7 ఏళ్ల వయస్సున్నప్పుడు జరిగిన ఘటనలతో క్లాస్ టీచర్ పై కక్ష పెంచుకున్నాడు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బెల్జియంలోని ఆంట్ వెర్స్ లోని తన ఇంటిలో మారియా వెర్లిండెన్(59) అనే మాజీ ఉపాధ్యాయురాలు 2020 నవంబర్ లో హత్యకు గురయ్యింది.  సమాచారం తెలుకుసుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆమె ఒంటిపై 101 కత్తి పోట్లు ఉన్నాయి. ఆమె మృతదేహం వంటింట్లో పడి ఉంది. మారియా అప్పటికే ఉపాధ్యాయురాలిగా రిటైరై నిరాశ్రయులైన ప్రజలకు సహాయం చేసే సామాజిక కార్యక్రమాల్లో పాల్గోంటోంది. నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు వందలాది డీఎన్ఏ లను పరిశీలించినప్పటికీ నిందితుడు దొరకలేదు.

వంటగదిలో   డైనిగ్ టేబుల్ పై  మనీ పర్సు అలాగే ఉంది. అందులో డబ్బుకానీ, ఇంట్లో ఇతర విలువైన వస్తువులు ఏమీ దొంగతానికికి గురికాలేదని పోలీసులు గుర్తించారు. అంటే వచ్చిన దొంగ నగదు కోసం   రాలేదని తేల్చారు పోలీసులు.

నేరం చేసింది ఒకప్పటి ఆమె దగ్గర చదువుకున్నవిద్యార్ధి గుంటర్ ఉవెంట్స్(37) ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం  చేయటానికి గల కారణాలను ఉవెంట్స్ చెప్పినప్పుడు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఉవెంట్స్ 7 ఏళ్ళ బాలుడిగా ఉన్నప్పుడు తరగతి గదిలో తోటి విద్యార్దులు అతడిని హేళన చేసేవారు. వేధించి అవమానించే వారని అతడు చెప్పాడు. క్లాస్ రూమ్ లో అందరూ తననను చిన్న చూపు చూసేవారని… ఆఖరుకు క్లాస్ టీచర్ మారియా కూడా తనను చిన్న చూపు చూశారని చెప్పుకొచ్చాడు.
Also Read : Pegasus Spyware : తెరపైకి మరోసారి పెగాసస్.. సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!
క్లాస్ లో ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పటానికి తాను చేయి ఎత్తినా తనకు అవకాశం ఇవ్వకుండా మారియా వేరొకరికి అవకాశం ఇచ్చి తనను నిరాశ  పరిచేదన్నాడు. ఈ కారణాలతోనే తాను ఇన్నాళ్లకు పగ తీర్చుకున్నానని పోలీసులకు చెప్పాడు.

కాగా….గుంటర్ ఉవెంట్స్ కు పాఠాలు చెప్పిన మారియా సోదరి 62 ఏళ్ల లట్ వెర్లిండన్ ఈ మాటలను నమ్మలేక పోయారు. ఎందుకంటే ఉవెంట్స్ కు నేను కూడా పాఠాలు చెప్పాను, అతనికి మారియాకు మధ్య జరిగిన సంఘటనలు ఎవరికీ గుర్తులేవు అని ఆమె అన్నారు.
Also Read : Pegasus Spyware : పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు-లోకేష్ నారా
వాస్తవానికి నవంబర్ 2020 లో ఆమెతో మంచిగా  మాట్లాడటానికే వెళ్ళానని…. 30 ఏళ్ల తర్వాత  ఆరోజు కూడా ఆమె మంచిగా మాట్లాడకపోగా తనను నిర్లక్ష్యంగా 30 ఏళ్ల క్రితం ఎలా ప్రవర్తించిందో అలాగే ప్రవర్తించటంతో అక్కడే ఉన్న కత్తి తీసుకుని 101 సార్లు కసితీరా పొడిచి చంపానని చెప్పాడు.   ఉవెంట్స్‌ను మంగళవారం న్యాయమూర్తి ముందు హజరు పరిచిన పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.